కృతజ్ఞతలు

ప్రచారం

నీకంటే ఎత్తుగా ఉండకూడదు

పని

నీకంటే పొట్టిగా ఉండకూడదు

బాకాలు డప్పులు

చుట్టూ ఉన్న జనాలకు వినోదాన్నిస్తాయి

చప్పట్లు ఈలలు

నిన్ను నీకు

తెలియకుండా చేస్తాయి

పరదా మీద ఎంత

పెద్ద దీపం బొమ్మ గీసినా

అడుగుల మీద వెల్తురు పడదు

మునిలా

నీ పని నీవు చేసుకుంటూ వెళ్లు

తుఫాను నీ పక్కనుంచే

నిశ్వబ్దంగా సలాం చేస్తూ వెళ్తుంది

(ఈ పోయెం రాయించిన జమాల్‌ పాషా నాతో గల్లీల్లో ఆడుకున్న బాల్యమిత్రుడు)

– ఆశారాజు

2024-06-09T22:10:17Z dg43tfdfdgfd