చాణక్యనీతి ప్రకారం... పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు ఇవే..!

ఆ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం లభించినప్పుడే ఆ పని మొదలుపెట్టాలట. ఈ విషయాన్ని పేరెంట్స్.. తమ పిల్లలకు కచ్చితంగా చెప్పాలట.

 

పిల్లలు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని పేరెంట్స్ కలలు కంటారు. ఉన్నతంగా ఉండాలని.. జీవితంలో మంచి స్థాయికి వెళ్లాలని అనుకుంటారు. అందుకోసం.. మంచి లక్షణాలు నేర్పించాలని కూడా అనుకుంటారు. అయితే... ఎవరికి తెలిసిన  మంచి వారు నేర్పుతారు. కానీ.. ఏవి నేర్పితే.. వారి లైఫ్ నిజంగా బాగుంటుందో ఆచార్య చాణక్యుడు ఏనాడో చెప్పాడు. ఆయన ప్రకారం.. పిల్లలకు పేరెంట్స్ కచ్చితంగా నేర్పించాల్సినవి ఇవే...

 

1.మరీ నిజాయితీగా ఉండటం..

ప్రతి పేరెంట్స్.. తమ పిల్లలను నిజాయితీగా ఉండమనే చెబుతారు. కానీ... మరీ ఎక్కువ నిజాయితీగా మాత్రం ఉండకపోవడమే మంచిదని చాణక్యుడు అంటున్నాడు. ఎందుకంటే.. పదునైన చెట్టు కొమ్మలను ముందుగా నరికేసినట్లు... ఎక్కువ నిజాయితీగా ఉన్న మనుషులనే చుట్టుపక్కల వారు నాశనం చేయాలని చూస్తారని, అతి నిజాయితీ పనికిరాదని చాణక్యుడు చెబుతున్నాడు.

2.లక్ష్యం లేకుండా పని చేయడం..

చాలా మంది పని చేయడం అంటే చేసేస్తారు. కానీ అది ఎందుకు చేస్తున్నాం.. మన లక్ష్యం ఏంటి అనే విషయాలు ఆలోచించరు. కానీ.. చాణక్యుడి ప్రకారం.. ఏ పని మొదలుపెట్టినా..నేను ఎందుకు  చేస్తున్నాను? నేను విజయం సాధించగలనా? లాంటి ప్రశ్నలు వేసుకోవాలట. ఆ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం లభించినప్పుడే ఆ పని మొదలుపెట్టాలట. ఈ విషయాన్ని పేరెంట్స్.. తమ పిల్లలకు కచ్చితంగా చెప్పాలట.

 

3.నిర్భయంగా..

ఏం చేసినా, ఎక్కడ ఉన్నా.. భయం లేకుండా ముందుకు సాగాలి అనే విషయాన్ని పేరెంట్స్ నేర్పించాలట. ఒక్కసారి భయం మొదలైతే జీవితాం నాశమౌతుందట. అందుకే.. నిర్భయంగా ఉండాలని నేర్పించమని చాణక్యుడు చెబుతున్నాడు.

4.చదువు..

పిల్లలకు చదువు ముఖ్యం. ఈ విషయం మనకు తెలుసు. కానీ... చదువును ముఖ్యంగా పుస్తకాలను పిల్లకు ఒక ఫ్రెండ్ లాగా అలవాటు చేయాలట.  చదువు వాల్యూ నేర్పుతుంది. మర్యాద నేర్పుతుంది.  కాబట్టి... పిల్లలకు ఈ విషయం ప్రాముఖ్యతను పేరెంట్స్ వివరించాలట.

5.మంచి పనులు..

పుట్టగానే ఏ వ్యక్తి గొప్ప వాళ్లు కారు.. కేవలం  వారు చేసే మంచి పనుల కారణంగానే గొప్పవారు అవుతారు. కాబట్టి.. మంచి పనులు చేయడం కూడా పిల్లలకు నేర్పించాలని చాణక్యుడు చెప్పాడు.

6.ఓటమిని అంగీకరించడం..

జీవితంలో గెలుపు, ఓటములు చాలా సహజం. గెలిచినప్పుడు పొంగిపోవడం... ఓడిపోయినప్పుడు కుంగిపోవడం చాలా మంది చేస్తారు. కానీ... ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా... ఓటమిని అంగీకరించడం.. దాని నుంచి కొత్త విషయాలు నేర్చుుకోవాలి. అనే విషయాలను కచ్చితంగా పిల్లలకు నేర్పించాలని చాణక్యుడు చెబుతున్నాడు.

2024-06-10T08:50:37Z dg43tfdfdgfd