ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

  • రెండు రోజుల్లో 85 వేల మందికి అందజేత 

హైదరాబాద్, వెలుగు : చేప ప్రసాదం పంపిణీ రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఇది సక్సెస్ కావడంతో బత్తిన కుటుంబసభ్యులు హర్షం వ్యక్తంచేశారు. ముగిసిన తర్వాత వచ్చిన వారిని దూద్ బౌలిలోని బత్తిన ఇంటికి వెళ్లాలని సూచించారు. అక్కడ సోమవారం కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. రెండురోజుల్లో  85  వేల మందికి చేప ప్రసాదం పంపిణీ జరిగినట్లు అధికారులు తెలిపారు. మొదటి రోజు 65 వేల మందికిపైగా వచ్చారు. రెండోరోజు మిగతా వారికి అందజేశారు.

ఇంతకు రెట్టింపుగా పంపిణీ చేసినట్లు బత్తిన కుటుంబసభ్యులు చెప్పారు. అస్తమా బాధితులకు బత్తిన కుటుంబసభ్యులు 175 ఏండ్లుగా చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి ఉచితంగా అల్పాహారం, భోజనం అందించిన స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్లతో పాటు జీహెచ్ఎంసీ, పోలీస్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, హెల్త్,  ఫైర్, మత్స్యశాఖ, ఆర్అండ్ బి తదితర శాఖల అధికారులతో పాటు ఎగ్జిబిషన్ గ్రౌండ్ సొసైటీ సభ్యులు,  మీడియా ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-06-10T02:16:33Z dg43tfdfdgfd