AKSHAYA TRITIYA 2024: అక్షయ తృతీయ రోజు శుభ ముహూర్తం ఎప్పుడు? ఏ నగరంలో ఏ టైంలో బంగారం కొనాలో తెలుసా?

Akshaya Tritiya 2024 Date: అక్షయ తృతీయ.. దీనిని అక్తి లేదా అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇది హిందువులు వైశాఖ మాసం శుక్ల పక్షం తదియ నాడు ఈ పండగను జరుపుకుంటుంటారు. అక్షయ అంటేనే నాశనం లేనిది.. అంతులేనిది.. తరిగిపోనిది అని అర్థం వస్తుంది. అందుకే ఇలాంటి పవిత్రమైన సందర్భంలో అక్షయ తృతీయ రోజున ఏదైనా కొనుగోలు చేస్తే అది రెట్టింపు అవుతుందని విశ్వసిస్తుంటారు. అందుకే ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇదే రోజున ఇంకా ఎన్నో శుభకార్యాలు కూడా చేస్తుంటారు. 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ మే 10న ఉదయం 4.17 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇది మే 11న (మరుసటి రోజు) తెల్లవారుజామున 2.50 గంటలకు ముగుస్తుంది. దృక్‌పంచాంగ్ వెబ్‌సైట్ ప్రకారం.. అక్షయ తృతీయ పూజా ముహూర్తం ఉదయం 5.33 గంటల నుంచి మధ్యాహ్నం 12.18 గంటల వరకు ఉంది.

ఇక అక్షయ తృతీయ రోజున బంగారం ఏ సమయంలో కొనాలనేది కూడా ఉంటుంది. 2024, మే 10 తెల్లవారుజాము 5.33 నుంచి మే 11న ఉదయం 2.50 గంటలుగా ఉంది. పురాణ గాథల ప్రకారం.. ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది. త్రేతా యుగం ఇదే రోజు ప్రారంభమైందని అంటుంటారు. పార్వతీ దేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది ఇదే రోజని పండితులు చెబుతుంటారు.

అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడం ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తోంది. ఆ రోజున బంగారం ఇంటికి తీసుకురావడంతో సంపద పెరుగుతుందని నమ్మకం. బంగారం మాత్రమే కాదు.. భూమి, ఇల్లు, కారు కొనేందుకు కూడా మంచి సమయం అని చెబుతుంటారు.

అక్షయ తృతీయ శుభముహూర్తం ఏ నగరంలో ఏ సమయంలో ఉందో తెలుసుకుందాం. హైదరాబాద్‌లో ఇది ఉదయం 5.46 గంటల నుంచి మధ్యాహ్నం 12.13 గంటల వరకు ఉంది. ఈ సమయంలో బంగారం కొంటే మంచిదని తెలుస్తోంది. న్యూ ఢిల్లీలో ఉదయం 5.33 నుంచి మధ్యాహ్నం 12.18 గంటలుగా ఉంది. ముంబైలో ఇది ఉదయం 06.06 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 గా ఉంది. బెంగళూరులో అయితే ఉదయం 5.56 నుంచి మధ్యాహ్నం 12.16 గా ఉంది. చెన్నైలో ఉదయం 5.45 నుంచి మధ్యాహ్నం 12.06 గా ఉంది.

ప్రస్తుతం బంగారం రేట్లు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ బంగారం రేటు తులానికి రూ. 66,050 వద్ద ఉండగా.. దీనికి మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ, హాల్‌మార్కింగ్ ఛార్జీలు వంటివి అదనంగా పడతాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T13:26:34Z dg43tfdfdgfd