ALOE VERA: ఈ విషయాలు తెలిస్తే వెంటనే.. మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటారు..

ఇంటి పెరట్లో వివిధ రకాల మొక్కలను పెంచుకోవడం సాధారణ విషయం. అయితే అంత స్థలం లేనివారు ఇండోర్ ప్లాంట్స్ సెలక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా రకాల మొక్కలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
కానీ వాటిలో కొన్ని మాత్రమే ఇంట్లో పెంచుకోవడానికి అనుకూలమైనవని వాస్తు, జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీని వ్యాపించేవి ఇందుకు ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ లిస్టులో ముందు ఉండేది కలబంద మొక్క.
కలబంద ఒక ఔషధ మొక్క. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వాడతారు. ఎన్నో రకాల సమస్యలకు ఇది నివారిణిగా పనిచేస్తుంది. అయితే ఇటీవల కాలంలో చాలామంది దీన్ని ఇండోర్ ప్లాంట్‌గా పెంచుకుంటున్నారు. దీని మెయింటెనెన్స్ చాలా సులభం. ఎలాంటి వ్యాధులు రావు. ఎలాంటి వాతావరణంలో అయినా సులభంగా పెరుగుతుంది. ఇంట్లో, గదిలో కలబంద మొక్కను పెంచుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఇంటీరియర్ స్పేస్‌కు కొత్త లుక్‌ను అందిస్తుంది. దీని జెల్‌తో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటంటే..

హెల్తీ ప్లాంట్

అలోవెరా గుజ్జులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్‌గా వాడతారు. ఇది నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ మొక్కకు గాలిని శుద్దిచేసే లక్షణాలు సైతం ఉంటాయి. అందుకే దీన్ని ఇంట్లో పెంచుకుంటే, గదిలోని హానికరమైన కలుషితాలను పీల్చుకొని, స్వచ్ఛమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. గాలి నాణ్యత పెరగడంతో శ్వాసకోశ వ్యాధుల ముప్పు తగ్గుతుంది. కాలిన గాయాలను నయం చేయగలదు. కలబంద చర్మాన్ని తేమగా మారుస్తుంది.

యాంటీ ఏజింగ్ లక్షణాలు

కలబంద మెడిసినల్ ప్లాంట్. దీని గుజ్జును అనేక వ్యాధులకు నివారణిగా, చికిత్సలో ఉపయోగిస్తారు. కలబంద ఆకులు కోసి, తోలు వలిచి, గుజ్జు నేరుగా తినవచ్చు. దీనితో జ్యూస్ చేసుకొని తాగవచ్చు. లేదా ఈ జెల్‌ను చర్మానికి అప్లై చేయవచ్చు. దీంతో చర్మం సాగే గుణం పెరిగి, వృద్ధాప్య లక్షణాలు దూరమవుతాయి. చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఇలా ఈ మొక్క అందాన్ని పెంచుతుంది.

జుట్టు, చర్మ ఆరోగ్యం

పోషకాలు పుష్కలంగా ఉన్న కలబంద, చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మొటిమలకు చికిత్సగా అలొవెరా జెల్ వాడతారు. వివిధ రకాల మొటిమల సమస్యలను ఇది దూరం చేస్తుంది. కలబంద గుజ్జును తలకు పట్టించి, కాసేపు ఆగి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. దీంట్లోని A, C, E విటమిన్లు చర్మ, జుట్టు ఆరోగ్యానికి మంచివి.

ఇమ్యూనిటీ పవర్

కలబంద మొక్క ఒత్తిడిని దూరం చేస్తుంది. స్ట్రెస్ నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. అలాగే శరీర రోగనిరోధక వ్యవస్థను సైతం బలపరుస్తుంది. ఆక్సిడేషన్ స్ట్రెస్, ఫ్రీ రాడికల్స్, UV డ్యామేజ్ వంటి నెగిటివ్ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కొంటుంది. క్యాన్సర్ రోగులకు, సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సంప్రదాయ మొక్కలు

కలబంద మొక్కలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని వ్యాపిస్తాయి. తద్వారా ఇవి ఇంటికి రక్షణ కవచంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా కూడా ఇది మనసును శుద్ధిచేసే శక్తిని కలిగి ఉంటాయని నమ్ముతారు. ఎందుకంటే ఇవి పాజిటివ్ ఎనర్జీతో ప్రశాంతతను ప్రోత్సహిస్తాయి. తద్వారా నెగిటివ్ విషయాలపైకి మనసు మళ్లదు.

జీర్ణ ఆరోగ్యం

కలబంద మన శరీరం ఐరన్‌ను శోషించుకునేలా సహాయపడుతుంది. ఇది సాధారణ పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. విటమిన్ శోషణను సైతం పెంచుతుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తూ కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. ఇలా పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

(Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)

2024-03-29T09:31:34Z dg43tfdfdgfd