APRIL LUCKY ZODIAC SIGN: ఏప్రిల్ నెలలో అత్యంత లక్కీ రాశుల వారి వీరే.. కుబేరులు అవ్వబోతున్నారు!

2024 April Lucky Zodiac Sign In Telugu: ఏప్రిల్ నెలలో సూర్యగ్రహంతో పాటు అనేక ముఖ్యమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ నెలలో లక్ష్మీనారాయణ యోగంతో పాటు బుధాదిత్య  రాజయోగం ఇతర రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా గ్రహ సంచారాల విషయానికొస్తే ఏప్రిల్ రెండున మేషరాశిలో బుధ గ్రహం తిరోగమన చేయబోతోంది. ఆ తర్వాత ఈ గ్రహం ఏప్రిల్ 9న మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. దీంతోపాటు ఏప్రిల్ 13వ తేదీన మేషరాశిలోకి సూర్యుడు సంచారం చేయబోతున్నాడు. దీంతోపాటు ఇదే సమయంలో సూర్యుడు బృహస్పతి తో కదలిక జరగబోతోంది. అలాగే ఏప్రిల్ 24వ తేదీన శుక్రుడు కూడా సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఏప్రిల్ నెల ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఏప్రిల్ నెల ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో.. లాభాలు పొందబోయే రాశుల వారెవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మిథునం (మే 21-జూన్ 21):

ఏప్రిల్ నెలలో ఏర్పడే ప్రత్యేక యోగాల కారణంగా మిధున రాశి వారు కూడా విపరీతమైన లాభాలను పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఉన్నటువంటి ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి వ్యాపారాల విస్తరణకు మంచి సమయం ఏర్పడుతుంది. దీంతో పాటు వ్యాపారాల్లో ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవబోతున్నాయి. అలాగే ఈ సమయంలో కావాల్సినంత డబ్బు లభించడమే కాకుండా వస్తువు సౌకర్యం కూడా పెరుగుతుంది. దీంతోపాటు కెరీర్ కు సంబంధించిన విషయాల్లో కూడా అనేక రకాల లాభాలు కలుగుతాయి.

వృషభం (ఏప్రిల్ 21 - మే 20):

ఏప్రిల్ నెలలో శుక్రుడు బుధుడు ఒకే రాశిలో కలవడం కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా వృషభ రాశి వారు ఊహించని లాభాలు పొందుతారు.. అంతేకాకుండా ఆస్తులతో పాటు కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వీరికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే లగ్జరీ జీవితాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు డబ్బు కెరీర్ కు సంబంధించిన అనేక విషయాల్లో ఊహించని లాభాలు పొందుతారు. దీంతోపాటు వృత్తిలో గౌరవం పెరగడమే కాకుండా కీర్తి ప్రతిష్టను లభిస్తాయి.

ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21):

ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం కారణంగా ఏప్రిల్ నెల మొత్తం ధనస్సు రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడు బృహస్పతి గ్రహాల కలయిక కారణంగా వీరి మనసులో ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగే పిల్లలనుంచి కూడా అనుకున్న శుభవార్తలు పొందుతారు. దీంతోపాటు వీరికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతోపాటు వీరికి ఆకస్మిక లాభాలు కూడా కలుగుతాయి. ఈ సమయంలో కష్టపడి పనిచేయడం వల్ల ప్రమోషన్స్ కూడా పొందుతారు. సంతానలేని సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

మకరం (డిసెంబర్ 22-జనవరి 21):

ఈ సమయంలో మకర రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడు బృహస్పతి కలయిక కారణంగా ఈ రాశి వారికి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. దీంతో పాటు మనసులో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే ఇంతకుముందు వైవాహిక జీవితంలో గొడవలు ఉన్నవారికి సమస్యలు పరిష్కారమవుతారు. దీంతోపాటు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు కూడా సులభంగా పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా హోదా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు వీరికి ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-03-29T06:17:56Z dg43tfdfdgfd