BEETROOT PALYA RECIPE : అన్నం, చపాతీలోకి బీట్‌రూట్ పల్యా రెసిపీ.. గట్టిగా లాగించేయెుచ్చు

బీట్‌రూట్ ఆరోగ్యానికి మంచిది. అయితే దీనితో వివిధ రకాల రెసిపీలు చేసుకోవచ్చు. మీరు కొత్తగా ట్రై చేయాలంటే బీట్‌రూట్ పల్యా తయారుచేయండి.. బాగుంటుంది. ఇది కర్ణాటక స్టైల్ రెసిపీ. మంగళూరులో దీనిని ఎక్కువగా చేస్తారు. లంచ్, డిన్నర్‌తోపాటుగా ఏదో ఒకటి ఉండాలని అనుకునేవారు దీనిని తయారు చేసుకోండి. ఇది తినేందుకు రుచిగా ఉంటుంది. అంతేకాదు.. ఆరోగ్యానికి కూడా ఉపయోగకరం. అందుకే కొత్తగా బీట్‌రూట్ పల్యాను తయారు చేయండి. అన్నం, చపాతీలోకి తినవచ్చు. దీనిని తయారుచేయడం కూడా సులభం.

బీట్‌రూట్ ఆరోగ్యానికి మంచిది. దీని వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. భోజనంలో ఆస్వాదించడానికి ఇది నోరూరించే వంటకం. అయితే మధ్యాహ్న భోజనంలో రుచికరమైన బీట్‌రూట్ పల్యా ఎలా చేయాలో చూద్దాం. ఈ బీట్‌రూట్ పల్యా చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటి?

బీట్‌రూట్ పల్యా తయారీకి కావాల్సిన పదార్థాలు

బీట్‌రూట్-2, శనిగపప్పు - 1 కప్పు, తురిమిన కొబ్బరి - 1 కప్పు, జీలకర్ర - 1/2 tsp, పచ్చిమిర్చి - 8, ఉల్లిపాయ - 2, ఆవాలు - 1 tsp, ఎండు మిర్చి - 2, కరివేపాకు - 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ - 1/4 tsp, కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్, రుచికి ఉప్పు, వంట నునె కొద్దిగా.

బీట్‌రూట్ పల్యా తయారీ విధానం

బీట్‌రూట్ పల్యా తయారు చేయడానికి ముందుగా శనగలను రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు బాగా ఉడికించాలి. ఇందులో బీట్‌రూట్‌ వేసి బాగా ఉడికించాలి. ముందుగా శనిగలు ఉడికిన తర్నాతే.. కొంత సమయం తరువాత బీట్‌రూట్ జోడించండి. బీట్‌రూట్ ఉడికించడానికి తక్కువ సమయం పడుతుంది.

ఇప్పుడు మిక్సీ జార్‌లో గింజలను కొబ్బరి తురుము వేసి అందులో ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి లేదా ఎండు మిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మరోవైపు ఒక పాత్ర తీసుకుని స్టవ్ మీద పెట్టి నూనె వేసి, వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి.

3 నిమిషాలు వేగిన తర్వాత బీట్‌రూట్, శనిగలు వేయాలి. తర్వాత ఉప్పు వేసి కలపాలి. 2 నిమిషాల తర్వాత రుబ్బిన మసాలా దినుసులు వేసి 3 నిమిషాలు బాగా వేయించాలి. చివరగా కొత్తిమీర వేసి మంట ఆపేయాలి.

మీకు నచ్చే రుచికరమైన బీట్‌రూట్ పల్యా రెడీ. లంచ్, చపాతీతో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది.

శనిగలు, బీట్‌రూట్ ఉడికించడానికి కుక్కర్‌ను కూడా ఉపయోగించవచ్చు. రెండు విజిల్స్ తో తీసేస్తే బాగా ఉడికిపోతుంది. శనిగలు పచ్చిగా ఉంటే, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. వాటిని బాగా ఉడికించాలి.

2024-04-29T05:51:00Z dg43tfdfdgfd