BELLAM KUDUMULU: వినాయకునికి నైవేద్యంగా పెట్టే బెల్లం కుడుముల తయారీ ఇదే

వినాయక చవితి రోజు గణేషునికి అనేక రకాల నైవేద్యాలు నివేదిస్తారు. అయితే వీటన్నింటిలో ముఖ్యమైనవి కుడుములు. వినాయకునికి కుడుములంటే ప్రీతికరం. రకరకాల ప్రాంతాల్లో వీటిని విభిన్నంగా తయారు చేస్తారు. చాలా ప్రాంతాల్లో సాధారణంగా నైవేధ్యంగా పెట్టే బియ్యంపిండితో చేసే బెల్లం కుడుములు ఎలా చేయాలో చూసేయండి.

బెల్లం కుడుముల తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు బియ్యంపిండి

2 కప్పుల నీళ్లు

సగం కప్పు బెల్లం తురుము

పావు కప్పు తాజా కొబ్బరి తురుము

పావు టీస్పూన్ యాలకుల పొడి

2 చెంచాల నెయ్యి

బెల్లం కుడుముల తయారీ విధానం:

  1. ముందుగా ఒక పాత్ర పెట్టుకుని అందులో నీళ్లు పోసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు అందులో బెల్లం వేసుకుని పూర్తిగా కరగనివ్వాలి.
  2. తర్వాత ఒకసారి ఈ నీటిని వడగట్టి మలినాలేమైనా ఉంటే తీసేయాలి. తర్వాత మరో పదినిమిషాలు వేడెక్కనివ్వాలి.
  3. అందులో తాజా కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి మరికాపేపు ఉడికించాలి.
  4. కొబ్బరి దగ్గరికి పడుతున్నప్పుడు కొద్దికొద్దిగా బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి.
  5. ఉండలు కట్టకుండా ఒక నిమిషం పాటూ పిండిని కలియబెట్టాలి. తర్వాత మూత మూసి మరో 5 నిమిషాలు ఉడికించాలి.
  6. స్టవ్ కట్టేసి మూత తీసి కాస్త చల్లారనివ్వాలి.
  7. చేతికి నెయ్యి రాసుకుని కొద్దిగా పిండి ముద్ద తీసుకుని గుండ్రంగా కుడుముల్లాగా చేసుకోవాలి.
  8. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకుని కాస్త నెయ్యి రాసుకోవాలి. సిద్ధం చేసుకున్న బియ్యం ఉండలను ఈ ప్లేట్లలో పెట్టుకోవాలి.
  9. పదినిమిషాలు ఆవిరి మీద ఉడికించుకుంటే వినాయకుని ప్రసాదం కోసం బెల్లం కుడుములు తయారైనట్లే.

2024-09-06T10:11:16Z dg43tfdfdgfd