BONAM RECIPE: బోనాల స్పెషల్‌ బెల్లపు అన్నం.. 5 నిమిషాల్లో రెడీ..

How To Make Bonam In Telugu: తెలంగాణలో ఫెమస్‌ పండగల్లో బోనాల పండగ ఒకటి. ఈ పండకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ బోనాలు సమర్పిస్తారు. అయితే ఈ బోనాన్ని ఎలా తయారు చేయాలో తెలుసా? తెలియకపోతే ఇప్పుడే తెలుసుకోండి.

Bellam Annam Recipe In Telugu: బోనాలు తెలంగాణ ప్రాంతంలో వైభవంగా జరుపుకునే ఒక ప్రత్యేకమైన జాతర. ఈ పండగ రోజున గ్రామ దేవతలను ఆరాధించడం ఆనవాతిగా వస్తోంది. ఈ రోజు భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ వంటి గ్రామ దేవతలను ఈ పండుగ సందర్భంగా ఘనంగా పూజిస్తారు. ఈ పండగను అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలసి జరుపుకుంటారు. ఇది సామాజిక సమైక్యతకు దోహదపడుతుంది. ఈ రోజు అమ్మవార్లకు బోనం కూడా సమర్పిస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి బోనం సమర్పించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మం. బోనాలు అనే పదం భోజనాలు అనే పదం నుండి వచ్చింది. అంటే దేవతకు నివేదించే భోజనం.. ఈ పండ రోజు భక్తులు మట్టి కుండల్లో బెల్లంతో అన్నాన్ని తయారు చేసి భోజనంగా దేవతకు సమర్పిస్తారు. అందుకే ఈ పండగకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఇప్పటికీ చాలా మందికి బెల్లంతో బోనం ఎలా వండాలో తెలియదు. అలాంటి వారికి కోసం తెలంగాణ స్టైల్‌ బెల్లపు అన్నం రెసిపీని పరిచయం చేయబోతున్నాం. 

కావలసిన పదార్థాలు:

అన్నం - 1 కప్పు

బెల్లం - 1 కప్పు 

పాలు - 2 కప్పులు

నీరు - 3-4 కప్పులు

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

ఏలకులు - 3-4

కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు

బాదం, పిస్తా - కొద్దిగా 

తయారీ విధానం:

అన్నం ఉడికించుకోవడం: ముందుగా బియ్యాన్ని బాగా కడిగి, నీరు పోసి స్టౌవ్‌పై బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. అన్నం ఉడికిన తర్వాత చల్లార్చాలి.

బెల్లం పాకం: ఒక పాత్రలో నీరు, బెల్లం వేసి బాగా మరిగించాలి. బెల్లం పాకం సన్నగా లేదా గట్టిగా కావాలనుకుంటే అందుకు తగినట్లు నీరు వేసుకోవాలి.

అన్నం, పాలు కలపడం: ఉడికించిన అన్నాన్ని బెల్లం పాకంలో వేసి బాగా కలపాలి. తర్వాత పాలు వేసి మరో సారి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇలా చేయండి: ఈ మిశ్రమాన్ని సన్నని మంట మీద కాస్త గట్టిపడే వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది.

రుచికరమైన టాపింగ్స్: చివరగా నెయ్యి, ఏలకులు పొడి, కొబ్బరి తురుము, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

చిట్కాలు:

బెల్లం రకం మీద ఆధారపడి పాకం తీపి తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు.

అన్నాన్ని బాగా ఉడికించాలి.. అంటే అన్నం గంజిలా కాకుండా, గట్టిగా, నుజ్జు నుజ్జుగా ఉండాలి.

పాలు వేసిన తర్వాత మిశ్రమాన్ని బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-07-27T08:17:20Z dg43tfdfdgfd