FUNNY ZODIACS: 5 ఫన్నీ రాశులు.. వీళ్లతో ఉంటే టైమ్ తెలీదు!

ధనస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశివారు ఎలాంటి ప్రదేశంలో నైనా పని చేయగలరు. దాదాపు అందరితోనూ మాట్లాడగలరు. కోపాన్ని ఇట్టే చల్లార్చి, నవ్వించడంలో దిట్టలు. ఈ రాశి వారిని గురుడు పాలిస్తాడు. గురుగ్రహానికి నవ్వుతో సంబంధం ఉంటుంది. ధనుస్సు రాశి వారు లోతైన, సంతోషకరమైన అదృష్టవంతులు, అంటే వారు నవ్వడాన్ని లోతుగా చూడగలరు, ప్రతిదానిలో హాస్యాన్ని చూడగలరు. వారు తరచూ ప్రయాణాలు చేస్తారు, చాలా నేర్చుకుంటారు, వారు సరదాగా, హాస్యభరితంగా ఇతరులతో ఉంటారు.
మిథున రాశి (Gemini): తెలివి, కమ్యూనికేషన్ యొక్క గ్రహమైన బుధుడు ఈ రాశి వారిని పాలిస్తాడు. రాశిచక్రంలో అత్యంత చమత్కారమైన రాశిగా వీరు ఉంటారు. మిథునరాశివారు పరిస్థితిని వెంటనే అర్థం చేసుకోగలిగే శీఘ్ర ఆలోచనాపరులు. వీరు ఇట్టే జోకులు వేస్తారు. తమ మాటలతోనే మాయ చేస్తారు. కోపాన్ని ఐస్‌క్రీమ్‌లా కరిగిస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ వీరి దగ్గర టన్నుల కొద్దీ ఉంటాయి. వీళ్లదో నవ్వుల ప్రపంచం. వీరితో ఎవరు ఉన్నా... నవ్వలేక ఇబ్బంది పడతారు. ఐతే.. ఒక్కోసారి వీరి జోకులు కొందరికి ఇబ్బంది కలిగిస్తాయి.
సింహరాశి (Leo) సింహరాశి వారు ఇతర్ని ఆకర్షించడంలో దిట్టలు. వీరిని సూర్యుడు పాలిస్తాడు. వీరు తరచుగా తమ చుట్టూ గుంపు ఉండేలా చేసుకుంటారు. ఇందుకోసం నవ్వును అస్త్రంగా ఉపయోగిస్తారు. సింహరాశి 5వ గృహంలో వినోదం ఉంటుంది. ఇదే గృహంలో ఆనందం, సృజనాత్మకత కూడా ఉంటాయి. ఇవన్నీ మంచి హాస్యానికి సరైనవి. సింహరాశివారు తరచుగా ఆనందంగా ఉంటారు, ఆహ్లాదంగా ఉంటారు, మంచి నవ్వును అందించడం ద్వారా ప్రజలకు మంచి అనుభూతిని కలిగించాలని కోరుకుంటారు. ఐతే, ఈ రాశి వారిపై ఎవరైనా జోకులు వేస్తే మాత్రం తట్టుకోలేరు.
తుల రాశి (Libra) తులరాశివారు సహజమైన మంత్రముగ్ధులు. వీరిని శుక్రుడు పాలిస్తాడు. వీరు కొత్త వ్యక్తులను కలుసుకున్నప్పుడు, వారిని ఆనందపరచడానికీ, హాస్యాన్ని ఉపయోగిస్తారు. మొద్దు బారినట్లు ఉండే ధనస్సు రాశి లాంటి వారు సైతం, తుల రాశి వారిని కలిశాక కూల్ అవుతారు. తుల రాశి వారు అందరినీ ప్రేమిస్తారు. అందరి క్షేమమూ కోరుకుంటారు. అందువల్ల వీరు అందరితోనూ జోక్స్ వేస్తున్నట్లు ఉంటారు. ఒక్కోసారి ఇష్టం లేకపోయినా సరదాగానే ఉంటారు. అది ప్రతి ఒక్కరికీ మంచి అనుభూతిని కలిగిస్తుంది.
కన్య రాశి (Virgo) ఫన్నీ రాశిచక్రాల జాబితాలో కన్యారాశిని చూసి కొందరు ఆశ్చర్యపోవచ్చు. వీరి ఖ్యాతి కొంత గజిబిజిగా, నిరాడంబరంగా ఉంటుంది. ఐతే.. వీరి తెలివితేటలు అసాధారణంగా ఉంటాయి. చురుకైన పరిశీలన, వేగవంతమైన మనస్సు వీరి సొంతం. వీరిని బుధుడు పాలిస్తాడు. అందువల్ల ఈ రాశి వారపు అప్పుడప్పుడూ చమత్కారం చూపిస్తారు. చిన్న చిన్న మాటలతోనే లోతుగా నవ్వుస్తారు. సెటైర్లు వెయ్యడంలోనూ వీరు ముందుంటారు. ఐతే.. వీరు కొంత భయస్తులు. అందువల్ల జోక్స్ వెయ్యడానికి ఒకట్రెండు సార్లు ఆలోచిస్తారు. మొత్తంగా కన్య రాశివారు ఎప్పుడూ తెలివైన చమత్కారాన్ని కలిగి ఉంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.

2024-03-29T12:01:44Z dg43tfdfdgfd