GOOD FRIDAY: గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుతారు? విశిష్టత ఏంటి?

క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు మూడు. లోకరక్షకుడు పుట్టిన రోజు క్రిస్మస్, శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే, సమాధి నుంచి తిరిగి పునరుత్థానుడిగా వచ్చిన రోజు ఈస్టర్. యేసు క్రీస్తు వారిని శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. క్రైస్తవులు ఆరోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. చర్చికి వెళ్ళి ప్రార్ధనలు చేస్తారు. తాము చేసిన పాపాల నుంచి రక్షించమని వేడుకుంటారు. దైవ కుమారుడైన యేసుక్రీస్తు సాధారణ మనిషిగా భూమి మీదకు వచ్చి మనుషులు పడే కష్టాలన్నీ అనుభవించాడు. బైబిల్ ప్రకారం గుడ్ ఫ్రైడే అనేది ఒక విచారకరమైన రోజు. కానీ మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజు. పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం తనని తాను సంతోషంగా త్యాగం చేసుకున్న రోజు. అందుకే ఆ రోజునే మంచి రోజుగా భావిస్తారు. గుడ్ ఫ్రైడే గా పిలుస్తారు. యేసుక్రీస్తు వారు శిలువ మీద ఏడు మాటలు పలికారు. గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ ఆ ఏడు మాటలు జ్ఞాపకం చేసుకుంటారు. తమని పాపాల నుంచి రక్షించడం కోసం యేసు క్రీస్తు అనుభవించిన బాధను తలుచుకుంటారు.

గుడ్ ఫ్రైడే ముందు రోజు రాత్రి యేసు ఏం చేశారంటే?

గుడ్ ఫ్రైడే ముందు రోజు తన శిష్యులు అందరికీ యేసుక్రీస్తు ప్రభు రాత్రి భోజనం ఇచ్చారు. మరుసటి రోజు గెత్సెమని తోటలో ప్రార్థన చేసుకుంటుండగా రోమా సైనికులు వచ్చి యేసుక్రీస్తుని బందీగా చేసుకుంటారు. ఆయన మీద ద్వేషంతో రగిలిపోతారు. యేసుక్రీస్తు అంటే నచ్చని కొందరు వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి దుర్భాషలాడుతూ శిలువ వేయాలని గట్టిగా అరుస్తారు. రోమ్ చక్రవర్తి అలాగే శిలువ శిక్ష విధిస్తాడు.

గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.  చర్చిల్లో గుడ్ ఫ్రైడేరోజు ప్రార్థనలు చేస్తారు.  బైబిల్​ పఠిస్తూ.. శ్లోకాలు.. శిలువ వృత్తాంతాన్ని  ప్రసంగాల ద్వారా  తెలుసుకుంటారు.  కొంతమంది క్రైస్తవులు ఉపవాసం పాటిస్తారు.  వారి ఆచారం ప్రకారం దేవుడిని ప్రార్థిస్తూ ..ఏసు క్రీస్తు గురించి గ్రంథాలు చదువుకుంటారు.  బహిరంగ ప్రదేశాలు, చర్చిల్లో శిలువ చిత్రాలు.. ఏసు శిలువ వేయడానికి దారితీసిన సంఘటనలు ధ్యానిస్తారు. కొంతమంది  ఆరాధకులు యేసు త్యాగానికి చిహ్నంగా  శిలువను ముద్దుపెట్టుకోవడం ... వంగి నమస్కరించడం ద్వారా పూజిస్తారు.

2024-03-29T01:30:15Z dg43tfdfdgfd