GUJARAT DAY 2024 RECIPE: వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే చల్లచల్లని స్పైసీ గుజరాతీ స్పెషల్ డ్రింక్..

Gujarat Day 2024 Recipe: మే 2 న గుజరాతీ డే ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువశాతం గుజరాతీలు హోం ఫుడ్‌ కే ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల స్వీట్లు ఇతర ఆహారపదార్థాలు వారు ఎక్కువ శాతం ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటారు. అయితే, ఇంట్లోనే తయారు చేసుకునే వేసవి వేడి నుంచి హాయినిచ్చే డ్రింక్‌ మీరు కూడా తయారుచేసుకోండి.. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. శరీరానికి వెంటనే చల్లదనాన్ని కూడా అందిస్తుంది.

కావాల్సిన పదార్థాలు..

పెరుగు- 2 కప్పులు

నీళ్లు- 2 కప్పులు

నల్ల ఉప్పు-1/2TBSP

జిలకర్ర పొడి -1/2 TBSP

ఉప్పు-1/2 Tbsp

మిరియాల పొడి-1/4 tbsp

కొత్తిమీర, పుదీనా (కట్‌ చేసింది)

ఐస్‌ క్యూబ్స్

స్పైసీ గుజరాతీ స్పెషల్ డ్రింక్ తయారీ విధానం..

ఈ గుజరాతీ స్పెషల్‌ డ్రింక్‌ తయారు చేయడానికి ముందుగా అన్ని వస్తువులను తీసుకోవాలి. పెరుగు మాత్రం ప్లెయిన్ అయి ఉండాలి. ఇది గడ్డ పెరుగు అయితే, మరీ బాగుంటుంది. ప్యాకెట్‌ పెరుగు కాకుండా ఇంట్లో తయారు చేసిన పెరుగుకు ప్రాధాన్యత ఇవ్వండి గుజరాతీలు కూడా ఇంట్లో తయారు చేసిన పెరుగు వినియోగిస్తారు.

ఇదీ చదవండి: కొత్తిమీర కొన్ని వారాలపాటు నిల్వ ఉండాలంటే ఈ ట్రిక్‌ పాటించండి..

ఇప్పుడు ఒక బ్లెండర్‌ తీసుకుని పెరుగు, చల్లని నీరు. జిలకర్ర, నల్ల ఉప్పు, ఉప్పు, నల్ల మిరియాలు వేసుకోవాలి. అన్ని వస్తువులను కలిపి బాగా బ్లెండ్‌ చేసుకోవాలి. దీన్ని మెత్తగా బ్లెండ్‌ చేసుకోవాలి. 

మీరు ఈ డ్రింక్‌ తాగే విధంగా బ్లెండ్‌ చేసుకోవాలి. కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదా చిక్కగా కావాలంటే తక్కువ నీరు పోసుకోవాలి. ఎందుకంటే కొందరు చిక్కగా ఉన్న పానియాన్ని ఇష్టపడతారు. మరికొంత మందికి పలుచగా ఉంటే ఇష్టం. అందుకే మీకు ఇష్టమైన ఫ్లేవర్ అనుసరించి డ్రింక్‌లో నీటిని వేసుకోండి.

ఇదీ చదవండి: ఈ 2 కిచెన్ వస్తువులు చాలు.. మీ ఫేస్ ఫేషియల్‌ చేసినట్లు మెరిసిపోతుంది..

ఆ తర్వాత ఈ డ్రింక్‌లో ఐస్‌ క్యూబ్స్‌ కావాలంటే వేసుకోవచ్చు. ఇది చాలా రీఫ్రెష్‌ ఇస్తుంది. చివరగా పన్నగా తరిగిన కొత్తమీర, పుదీనా ఆకులను వేసుకుని గార్నిష్‌ చేసుకోవచ్చు. ఈ స్పైసీ గుజరాతీ డ్రింక్ మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చల్లచల్లగా సర్వ్‌ చేయండి. తక్కువ వస్తువులతో రుచిగా ఉంటుంది. ఈ చల్లని డ్రింక్‌ ను గుజరాతీ వీధుల్లో కూడా విపరీతంగా విక్రయాలు చేపడతారు. ఇంట్లో ఎక్కువ శాతం ఈ డ్రింక్‌ తయారు చేసుకుని మీరు కావాలంటే ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేసుకుని పెట్టుకోవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-05-01T07:38:42Z dg43tfdfdgfd