HOROSCOPE: మార్చి 29 రాశి ఫలాలు.. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది..!

జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024, మార్రి 28వ తేదీ, శుక్రవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం : వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. సమయం చాలావరకూ అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, విందుల మీదా, విలాసాల మీదా ఎక్కువగా ఖర్చు చేయ డం జరుగుతుంది. రాదని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూ లవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
వృషభం:  అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే అవకాశ ముంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యయ ప్రయాసలతో ముఖ్య మైన వ్యవహారాలు, కార్యకలాపాలు పూర్తవుతాయి. పిల్లల కారణంగా కుటుంబంలో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. వృత్తి జీవితం సాదా సీదాగా సాగిపో తుంది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదాల విషయంలో శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం:  రోజంతా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి ఉపశ మనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెంచడానికి వీలుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.
కర్కాటకం:   కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెడతాయి. ఉద్యోగ జీవితంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి లోటుండదు. అయితే, ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆశించిన సమాచారం అందుతుంది.
సింహం: వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపడతారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు కొద్ది కష్టంతో పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
కన్య రాశి: వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తిసామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
తుల: ఉద్యోగంలో మార్పులకు, ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఆదరా భిమానాలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆదాయపరంగా దాదాపు ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది. జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభి స్తుంది
వృశ్చిక రాశి: శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ముఖ్య మైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇతర దేశాల్లో ఉంటున్న పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
ధనస్సు: వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆశించిన ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు ఢోకా ఉండదు. ఆదాయ ప్రయత్నాలకు ప్రాధాన్యమిస్తారు. అనుకోని ఖర్చు లతో ఇబ్బంది పడతారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. స్నేహితుల సహాయంతో ముఖ్య మైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రయత్నాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం: ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఇబ్బందికర వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక బాధ్యతలను ఎవరికీ అప్పగించవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాలి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
కుంభం: విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఒకటి రెండు శుభవార్తలు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూల మైన సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. చిన్న ప్రయత్నంతో మంచి ప్రయోజ నాలను పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మీనం: ఉద్యోగం మారడానికి ప్రయత్నించేందుకు ఇది మంచి సమయం. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపా రాలు పరవాలేదనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది.

2024-03-29T00:30:12Z dg43tfdfdgfd