JUPITER AND VENUS CONJUNCTION 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక.. ఈ రాశువారికి లాభాలే లాభాలు!

Jupiter and Venus Conjunction 2024: జ్యోతిష్య శాస్త్రంలో దేవగురు బృహస్పతిని పవిత్ర గ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ గ్రహాన్ని జ్ఞానం, డబ్బుకు సూచికగా చెప్పుకుంటారు. అయితే ఈ గ్రహం మే 1వ తేదిన మేష రాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం చేసింది. మే 19వ తేదిన కూడా వృషభ రాశిలోకి శుక్ర గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా వృషభ రాశిలో శుక్రుడు, గురుడు కలవబోతున్నారు. దీంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కొందరికీ విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే శుక్రుడు, గురుడు గ్రహాల కలయిక కారణంగా ఏయే రాశిలవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి. 

ఈ రాశులవారికి విపరీతమైన ధన లాభాలు:

వృషభ రాశి:

గురు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఏర్పడే ప్రత్యేక ప్రభావంతో వృషభ రాశివారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. దీంతో పాటు వ్యాపారం, వృత్తి, విద్య, ఆర్థిక పరంగా మంచి శుభవార్తలు కూడా వింటారు. అలాగే వీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఎలాంటి పనుల్లోనైనా రణిస్తారు. 

మిథున రాశి:

మిథున రాశివారికి ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా అనేక ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కెరీర్‌ పరంగా అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తాయి. అంతేకాకుండా కొత్త కొత్త అవకాశాలు కూడా పొందుతారు. అలాగే వీరు విదేశీ పర్యటనలకు వెళ్లే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. దీంతో పాటు జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. 

కర్కాటక రాశి:

గురు, శుక్ర గ్రహాల కలయిక వల్ల కర్కాటక రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అలాగే పూర్వీకుల ఆస్తుల నుంచి కూడా అనేక లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

సింహరాశి:

సింహ రాశివారికి కూడా  ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా సంపాద కూడా పెరుగుతుంది. అలాగే వీరికి కొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. దీంతో పాటు శుక్రుడి అనుగ్రహం వల్ల జీవితంలో సౌఖ్యం కూడా సులభంగా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా వీరికి సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-05-02T12:28:39Z dg43tfdfdgfd