KARELA HAIR OIL: కాకరకాయ హెయిర్ ఆయిల్ ఎక్కడైనా దొరికితే కొనుక్కోండి, జుట్టు రాలడం ఇట్టే ఆగిపోతుంది

Karela Hair oil: కరేలా ఆయిల్ అంటే చేదు కాకరకాయ విత్తనాల నుండి తయారయ్యే హెయిర్ ఆయిల్. దీన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద పద్ధతుల్లో ఉపయోగిస్తున్నారు. ఈ నూనెలో మన జుట్టుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. జుట్టు పెరుగుదలకు ఉత్తమంగా పనిచేస్తాయి. కాకరకాయ ఆయిల్ ఆయుర్వేద షాపుల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

చుండ్రును తగ్గిస్తుంది

ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం కాకరకాయ ఆయిల్ వాడటం వల్ల చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే వెంట్రుకలు రాలిపోయే సమస్యకు కూడా దూరంగా ఉండవచ్చు. ఎవరికైతే వెంట్రుకలు అధికంగా రాలిపోతున్నాయో వారు తమ నూనెను మార్చి ఒకసారి కాకరకాయ ఆయిల్ ను రెండు నెలలు వాడి చూడండి. వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ కాకరకాయ ఆయిల్ రాయడం వల్ల తలపై పేర్కొన్న అదనపు నూనె ఉత్పత్తి అవుతున్నా... అదనపు నూనెను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

కాకరకాయ ఆయిల్ ఎలా వాడాలి?

చుండ్రు, జుట్టు రాలడం ఈ రెండు సమస్యలతో మీరు బాధపడుతుంటే ఒక పండిన అరటిపండును తీసుకోండి. దాన్ని ఒక గిన్నెలో వేసి చేత్తోనే గుజ్జులా చేసి అందులో కాకరకాయ ఆయిల్ ను వేయండి. దీన్ని బాగా కలిపి హెయిర్ మాస్క్‌లా వేసుకోండి. అరగంట పాటు అలా వదిలేయండి. ఈ మిశ్రమం తలపై ఉన్న మాడుకు తగిలేలా రాయాలి. అరగంట తర్వాత షాంపూ కండిషనర్ తో శుభ్రం చేసుకోండి. ఇలా తరచూ చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. వెంట్రుకలు బలంగా పెరగడం మొదలవుతుంది.

తలపై ఉన్న మాడుపై అదనంగా నూనె ఉత్పత్తి అవుతుంటే కాకరకాయ ఆయిల్‌తో చిన్న చిట్కాను పాటించండి. ఒక చిన్న గిన్నెలో కాకరకాయ ఆయిల్, ఆపిల్ సెడర్ వెనిగర్ సమాన భాగాలుగా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మాడుకు పట్టించండి. అరగంట పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో, గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. వారానికి రెండుసార్లు ఇలా చేయండి చాలు. అదనపు నూనె ఉత్పత్తి కాకుండా నియంత్రణలో ఉంటుంది. జుట్టు కూడా పొడవుగా పెరుగుతుంది.

జుట్టు తెల్లబడకుండా

మీ జుట్టు త్వరగా తెల్లగా మారుతుంటే కాకరకాయ నూనె ఉపయోగించండి. వారానికి రెండుసార్లు ఈ కాకరకాయ నూనె తలకు పట్టించండి. ఇలా చేయడం వల్ల జుట్టు తెల్లబడే అవకాశం బలహీన పడుతూ ఉంటుంది. కేవలం చుండ్రు తగ్గడం, జుట్టు పెరగడమే కాదు... కాకరకాయ నూనె వల్ల మాడుకు వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. దురద వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మవ్యాధులు కూడా రావు. కాకరకాయలు అనేది ప్రకృతి ఇచ్చిన బహుమతిగా భావించండి.

2024-09-11T04:28:15Z dg43tfdfdgfd