MONEY PLANT: మీ ఇంట్లో మనీ ప్లాంట్ లేదా? ఈ విషయం తెలిస్తే ఇల్లంతా మొక్కలతో నింపేస్తారు

ఇంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతవరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇంటి పరిసరాల్లో చెట్లను పెంపకం చేస్తుంటాము. ఇంటి పరిసరాలు ఎక్కువగా పూల మొక్కలు, స్థలం ఉన్నవారు అయితే పెద్ద చెట్లను పెంచడానికి ఇష్టపడుతారు. కానీ ఇది పల్లెల్లో మాత్రమే సాధ్యపడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో చెట్లను పెంచుకునేంత స్థలం ఉండదు. మరి ఉన్నంత స్థలంలో మంచి ఆక్సిజన్‌ని అలాగే ఆహ్లాదాన్ని పంచే చెట్లను మనం పెంచుకునే అవకాశం ఉంది.

ఈరోజుల్లో చాల మంది ఇంట్లో మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెట్టుకుంటారు. అందులో ఒకటి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే మంచిదని, అందులో ముఖ్యంగా పక్కవారి ఇంట్లో ఉన్న చెట్టుని దొంగ చాటున తీసుకొచ్చి పెంచుకుంటే మంచిదన్న ప్రచారం ఉంది కానీ, అలా చేయడం ఏమాత్రం మంచిది కాదు.

Tirupati Trains: తిరుపతి వెళ్లేవారికి అలర్ట్... విజయవాడ, విశాఖ మీదుగా మరిన్ని స్పెషల్ ట్రైన్స్

మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవడం చాల మంచిదని పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్ హనుమాన్ ఆలయ పూజారి రుద్రభట్ల శ్రీకాంత శర్మ అన్నారు. చాలా వరకు ప్రజలు ఈ చెట్టు పెట్టుకుంటే అందనంత డబ్బు, పట్టనంత ఐశ్వర్యం వస్తుంది అనుకుంటారు కానీ ఈ చెట్టు పెంచుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.

---- Polls module would be displayed here ----

మనీ ఇంట్లో పరిసరాల్లో పెంచుకోవడం వలన అందులో గుణాలు కలుషిత గాలిని తొలగిస్తాయని అన్నారు. అంటే ఎయిర్ ప్యూరిఫయర్‌గా పని చేస్తుంది. గాలి నుండి వచ్చే రుగ్మతలు వల్ల కాస్త అలసట వంటివి వస్తుంటాయి. ఈ చెట్టు ఇంట్లో ఉంటే అలాంటివి దరిచేరకుండా చేస్తాయి. ఈ మనీ ప్లాంట్‌కి సూర్యరశ్మి కూడా అవసరం లేదు. అలాగే మట్టిలో నాటల్సిన అవసరం లేదు.

టెన్త్ చదివారా? స్వయం ఉపాధి కోసం ఉచిత శిక్షణ, వసతి, భోజనం

ఒక బాటిల్ లేదా పాట్స్ వంటి వాటిలో పెట్టుకున్న పెరుగుతాయి కాబట్టి ఈ మొక్కలను ఇంట్లో గదులలో పెట్టుకోవడం కూడా మంచిది అని వారు తెలిపారు. వాటి నుండి విడుదల అయ్యే ఆక్సిజన్ పాజిటీవ్ ఎనర్జీ ఇవ్వడంలో బాగా పనిచేస్తుంది. ఇది మనీ ప్లాంట్‌కి ఉన్న ప్రత్యేకతలు అందుకే ఈ చెట్టు పెంపకంపై సాధారణంగా అందరూ ఇష్టపడుతారు. ఒకవేళ ఇంట్లో లేదా? ఇప్పుడే ఒక కొమ్మని తీసుకొచ్చి ఇంట్లో నాటుకోండి చాల మంచిది.

2024-05-01T10:56:26Z dg43tfdfdgfd