NATURAL WAYS TO GET RID OF RATS: ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలుకలు అస్సలు రావు.. ఉన్నవి కూడా పారిపోవడం ఖాయం!

Home Remedies For Rats And Mice: కొంతమంది ఇళ్లలో గదులను ఎంత శుభ్రంగా చేసినప్పటికీ తలుపులకు రంధ్రాలు చేసుకొని ఎలుకలు వస్తూ ఉంటాయి నిజానికి ఎక్కువగా మన ఇళ్లలో ఎలుకలు వంటగదిలో కనిపిస్తూ ఉంటాయి. అయితే వంట గదిలో వివిధ ఆహార పదార్థాలు తింటే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. నిజానికి అవి తిన్న ఆహార పదార్థాలను మనం తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతమంది ఇళ్లలోనైతే బట్టలు పెట్టుకుని బీరువాల్లో కూడా దూరుతూ ఉంటాయి. కొత్త బట్టలను సైతం కొరికి తింటూ ఉంటాయి. నిజానికి ఎంత శుభ్రం చేసినప్పటికీ ఎలుకలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవు అయితే దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఇంట్లోనే సులభంగా ఈ చిన్న చిన్న చిట్కాలను వినియోగించి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఎలాంటి చిట్కాలను వినియోగించడం వల్ల ఎలుకలు ఇంట్లో నుంచి పారిపోతాయే ఇప్పుడు తెలుసుకోండి.

ఇలా చేయండి..

కొంతమంది ఇళ్లలో గోడలకు రంధ్రాలు చేసి ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెక్కతో తయారు చేసిన తలుపులు కలిగిన ఇళ్లలోకి ఎక్కువగా ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే అవి రంద్రాలు చేసిన వాటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మూసివేయడం చాలా మంచిది.. అలాగే కొందరి ఇళ్లలో గోడల్లోకి కూడా రంద్రాలు చేసి ఎలుకలు దూరుతూ ఉంటాయి. అయితే వీటిని కూడా సిమెంటుతో మూసివేయడం చాలా మంచిది. ముఖ్యంగా రంధ్రాలు ఉన్నచోట ఐరన్ తో కూడిన వస్తువులను పెట్టడం వల్ల కూడా వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఆహార పదార్థాలను ఉంచకండి..

వెనకాల ప్రభావిత ప్రాంతాల్లో చాలామంది ఆహార పదార్థాలను ఎక్కువగా పడేస్తూ ఉంటారు. ఇలా చేయడం అంత మంచిది కాదు.. ఎక్కువగా ఆహార పదార్థాలున్న చోటికి ఎలుకలు వస్తాయి. కాబట్టి ఇప్పటికే మీ ఇంట్లో ఎలుకలు ఉంటే ఆహార పదార్థాలను బయటపడేయడం చాలా మంచిది. ముఖ్యంగా వంట గదిలో పాత్రలను శుభ్రం చేసిన తర్వాత ఏర్పడే ఆహార పదార్థాల చెత్తను కూడా బయటపడేయడం ఎంతో మంచిది.

ఎలుకలను పట్టుకోండి..

మీ ఇంట్లో ఇప్పటికే చాలా ఎలుకలు ఉంటే తప్పకుండా వాటిని పట్టుకొని బయట వదలడం ఎంతో మంచిది. లేకపోతే ఇంట్లో మరిన్ని తయారయ్యే అవకాశాలున్నాయి. దీనికోసం మార్కెట్లో లభించే ఎలుకల బోను లేదా జిగురుగా ఉండే ఎలుకలు పట్టే మందును కూడా వినియోగించవచ్చు. ముఖ్యంగా ఎలుకల బోనాలు వినియోగించడం వల్ల ఎలుకలు ఇంట్లోనే మరణించే ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి దీనిని వినియోగించడమే చాలా మంచిది.

రసాయనాలతో కూడిన పదార్థాలు..

ఇంట్లో నుంచి ఎలుకలు పారిపోవడానికి మార్కెట్లో అనేక రకాల రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. వీటిని వినియోగించడం వల్ల కూడా ఇంట్లో నుంచి ఎలకలను సులభంగా పారద్రోలవచ్చు. అయితే ఈ ప్రొడక్షన్ వినియోగించడానికి ఆహార పదార్థాలు కూడా అవసరం అవుతాయి. వీటిని వేరుశెనగల్లో వినియోగించి ఎలుకలకు పెట్టడం వల్ల సులభంగా ఇంట్లో నుంచి పారిపోతాయి

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-30T16:51:29Z dg43tfdfdgfd