PLANTS: పూలు, పండ్ల మొక్కలు కావాలా.. ఇక్కడ రూ.150కే కొనొచ్చు!

పండ్ల మొక్కల ప్రాముఖ్యత మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే అనారోగ్యం బారిన పడినా , నీరసంగా ఉన్నా పెద్దలతో పాటు వైద్యులు కూడా ఫ్రూట్స్ తినాలి .. లేకపోతే జ్యూస్ లు తాగాలని సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అయితే లోకల్18 పండ్ల మొక్కలపై ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ శివారులోని రగుడు ఎల్లమ్మ ఆలయానికి ఎదురుగా పద్మ నర్సరీ గత 20 సంవత్సరాలుగా తన తండ్రి వారసత్వంతో రాజు అనే యువకులు రన్ చేస్తున్నారు. అయితే ఈ నర్సరీలో పూల మొక్కలతోపాటు పండ్ల మొక్కలను కూడా అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పండ్ల మొక్కలపై లోకల్ 18 ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తోంది. ఈ సందర్భంగా నర్సరీ నిర్వాహకుడు రాజు లోకల్18 తో మాట్లాడుతూ… పద్మ నర్సరీలో 35కు పైగా వెరైటీస్ తో కూడిన పండ్ల మొక్కలు తమ నర్సరీలో ఉన్నాయని తెలిపారు. మ్యాంగో దానిమ్మ హైబ్రిడ్ కొబ్బరి తప్ప, మిగతావన్నీ వన్ ఇయర్ కే క్రాఫ్ తో ప్లాంట్స్ గ్రో అవుతాయని వారు చెబుతున్నారు.
ఎవరికైనా నాణ్యమైన A1 గ్రేడ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ కావాలంటే సిరిసిల్ల పట్టణ శివారులోని పద్మ నర్సరీని సందర్శించాలని కోరుతున్నారు. ఎవరికైనా ప్రత్యేకమైన పండ్ల మొక్కలు కావాలన్నా కూడా.. ఆర్డర్ పై తెప్పిస్తామని అంటున్నారు. ఈ నర్సరీలో సపోటా, అవకాడో, దానిమ్మ, బత్తాయి, సంత్ర, హైబ్రిడ్, హిమాటైడ్ A1 క్వాలిటీ శ్రీగంధం, రెడ్ శాండిల్ మొక్కలు తమ నర్సరీలో ఉన్నాయని అన్నారు.
పండ్ల మొక్కలు రూ.150/-,నుంచి 1200/-,1500/- అమ్ముతున్నట్లుచెప్పారు. ప్లాంట్స్ సైజును బట్టి కూడా అమ్మకాలు జరుపుతామని పేర్కొన్నారు. పూల మొక్కలతో పోల్చితే పండ్ల మొక్కలకు 70నుంచి 60 శాతం మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుందని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎవరికైనా నాణ్యమైన A1 గ్రేడ్ పండ్ల మొక్కలు కావాలంటే పద్మ నర్సరీని సందర్శించాలని నిర్వాహకుడు రాజు కోరుతున్నారు. సెల్: 9666951172. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ శివారులోని రగుడు ఎల్లమ్మ ఆలయనికి ఎదురుగా 20 సంవత్సరాలుగా నాణ్యమైన ప్లాంట్స్ రైతులకు, ప్రజలకు అందిస్తున్నామని వారు చెబుతున్నారు.

2024-03-27T07:26:40Z dg43tfdfdgfd