ROSE WATER BENEFITS : ముఖం మెరిసేందుకు రోజ్ వాటర్‌ను రాత్రిపూట ఇలా వాడండి

ఎండాకాలం మెుదలైంది. సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ మండుతున్న ఎండల కారణంగా చర్మం రంగు నల్లబడటం మొదలవుతుంది. మీరు ఎక్కువ సమయం బయట ఉంటే, ఈ వేసవిలో మీ చర్మం బాగుండాలంటే.. మీ చర్మాన్ని క్రమం తప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చర్మానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. రోజ్ వాటర్ స్కిన్ టోన్‌ని మెరుగుపరచడంలో అద్భుతంగా సాయపడుతుంది.

రోజూ రాత్రిపూట ఈ రోజ్ వాటర్ తో కొన్ని ఫేస్ ప్యాక్ లను ముఖానికి వేసుకుంటే ఎండ వల్ల చర్మం నల్లబడకుండా ఉంటుంది. చర్మంలోని మురికి పూర్తిగా తొలగిపోతుంది. ముఖం కాంతివంతంగా, తాజాగా అవుతుంది. స్కిన్ టోన్‌ని మెరుగుపరచడంలో సహాయపడే రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్‌లను చూద్దాం.

ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్

ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. ముల్తానీ మట్టి - 2 టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ - 3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ముందుగా ముల్తానీ మట్టిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత దీన్ని ముఖానికి, మెడకు పట్టించి 15-20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి 2 సార్లు వాడితే మీ ముఖం మెరిసిపోతుంది.

కాఫీ పౌడర్, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్

కాఫీ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ - 2-3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఒక గిన్నెలో 2 టేబుల్‌స్పూన్‌ కాఫీ పౌడర్‌, రోజ్‌ వాటర్‌ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత దీన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేసి 15-20 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు వాడితే చర్మంలోని మృతకణాలు తొలగిపోయి ముఖం మెరిసిపోతుంది.

శెనగపిండి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్

శెనగపిండి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. శెనగ పిండి - 2 టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ - 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి శెనగపిండిని తీసుకుని అందులో రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత దీన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించి 15-20 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.

అలోవెరా, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్

అలోవెరా, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అలోవెరా జెల్ - 2 టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ - 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ముందుగా 2 టేబుల్‌స్పూన్‌ కలబంద జెల్‌ని ఒక గిన్నెలో తీసుకుని రోజ్‌ వాటర్‌తో కలపాలి. తర్వాత దీన్ని ముఖం, చేతులు, మెడ వంటి ప్రాంతాల్లో అప్లై చేసి 15-20 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. రోజూ రాత్రిపూట ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే ముఖం మురికిగా మారకుండా చూసుకోవచ్చు.

చందనం, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్

చందనం, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ ముఖానికి బాగుంటుంది. చందనం పొడి - 2 టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ - 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఒక గిన్నెలో చందనం పొడి, రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత దీన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేసి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.

2024-03-29T09:24:36Z dg43tfdfdgfd