SIDE EFFECTS OF PACKED WHEAT FLOUR: ప్యాకెట్ గోధుమ పిండి విషంతో సమానమా? రోగాలకు దారితీస్తుందా!

Wheat Flour Side Effects: ప్రస్తుతం ఇండియాలో గోధుమ పిండిని ఉపయోగించని ఇల్లు ఏదీ ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరూ తమ వంటకాల్లో ఏదోక రూపంలో గోధుమ పిండిని వినియోగిస్తూనే ఉంటారు. అయితే పూర్వం గోధుమలను తెచ్చి రూబ్బుకొని పిండిని తయారు చేసుకునేవారు. ఆధునిక కాలంలో రెడీమేడ్ కు ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఎక్కువ శాతం మంది మార్కెట్ నుంచి ప్యాకెట్ పిండిని కొనుగోలు చేస్తున్నారు. గోధుమ పిండిలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ కారణంగా, దీన్ని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరం బరువు పెరగడమే కాకుండా మధుమేహం వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఇందులో ఉండే గ్లూటెన్ జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అలాగే, శరీరంలో అలర్జీ ఏర్పడి వాపులు వచ్చే అవకాశం ఉంది. 

ప్యాకెట్ పిండితో ఆరోగ్యంపై ప్రభావం..

గోధుమ పిండిలో గ్లూటెన్ ఉండటం వల్ల గ్లూటెన్ అలెర్జీ వస్తుంది. దీని వల్ల ప్రజలు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు ఇది కడుపు నొప్పికి కూడా కారణమవుతుంది. ఈ ఫిర్యాదు పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్యాకెట్ పిండి వాడేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గ్లూటెన్ ఎసిడిటీ, మధుమేహం, ఊబకాయం, చర్మం మొదలైన సమస్యలను కూడా కలిగిస్తుంది.

ఫైబర్స్ పోతాయి

గోధుమ గింజలపై ఉండే పై పొరలో ఫైబర్ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ప్యాక్ చేసే పిండిని తయారుచేసేటప్పుడు గోధుమ నుంచి ఈ పొర పూర్తిగా తీసివేయబడుతుంది. దీనివల్ల గోధుమల్లో ఉండే పోషకాలు నశిస్తాయి. మిల్లులో గోధుమలు పిండి చేసే క్రమంలో గోధుమ గింజపై పొర తీసివేయబడదు. అందువల్ల ఈ పిండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మిల్లు పిండిని ఫిల్టర్ చేయకుండా వాడాలి. దీని వల్ల అందులో ఉండే ఊక తొలగిపోదు. ఊకలోని పీచు శరీరానికి మేలు చేస్తుంది.

మల్టీగ్రెయిన్ పిండిని ఉపయోగించండి

కేవలం గోధుమ పిండికి దూరంగా ఉంటే మంచిది. గోధుమలలో తక్కువ ప్రోటీన్ ఉంటుంది. మరికొన్ని గింజలను గోధుమలతో కలిపి దగ్గరలోని మిల్లుకు తీసుకెళ్లి అక్కడ పిండి చేస్తే బాగుంటుంది. దీని నుంచి తయారైన మల్టీగ్రెయిన్ పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. 5 కిలోల గోధుమలలో ఈ పదార్థాలను కలపడం ద్వారా మల్టీగ్రెయిన్ పిండిని తయారు చేయవచ్చు. 

అయితే ఉత్తమ పద్ధతిలో మల్టీగ్రెయిన్ పిండిని తయారు చేసుకునేందుకు కావాల్సిన ముడిసరుకులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1) 5 కిలోల గోధుమలు

2) 250 గ్రాముల సోయాబీన్ గింజలు

3) 250 గ్రాముల మొక్కజొన్న

4) 250 గ్రాముల జొన్న

5) 250 గ్రాముల మిల్లెట్

6) 250 గ్రాముల శెనగపప్పు

7) 200 గ్రాముల వోట్స్

8) 200 గ్రాముల బార్లీ

9) 250 గ్రాముల అవిసె గింజలు

ఇలా తయారుచేసిన పిండిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-27T03:37:24Z dg43tfdfdgfd