SUN TRANSIT 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!

Sun Transit 2024 Effect: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా భావిస్తారు. అందుకే ఈ గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ గ్రహాన్ని శక్తి, ఆత్మకు కారకంగా భావిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గ్రహం ఆగస్టు నెలలో రాశి సంచారం చేయబోతోంది. సూర్యుడు ఏడాది తర్వాత సొంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ గ్రహం సింహ రాశిలోకి ఆగస్టు 16వ తేదిన సంచారం చేయడం వల్ల చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

మేష రాశి:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశిని అంగారకుడు పాలిస్తారు. ఈ రాశికి సూర్యుగు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ సంచారం జరగడం కారణంగా వీరికి కెరీర్‌ పరంగా చాలా బాగుటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మతపరమైన విషయాలపై ఆసక్తి రెట్టింపు అవుతుంది. కుటుంబం నుంచి కూడా సపోర్ట్ లభించి అనుకున్న పనులు త్వరగా చేయగలుగతారు. దీంతో పాటు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మారుతాయి. 

కర్కాటక రాశి:

కర్కాటక రాశివారికి కూడా సూర్యుడి సంచారం కారణంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా విపరీమతైన లాభాలు వస్తాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి పురోగతి కూడా లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. 

సింహరాశి:

సూర్యుడి సంచారం కారణంగా సింహ రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి వృత్తిపరమైన జీవితంలో వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన విషయంలో విజయాలు కూడా సాధిస్తారు. అలాగే ఉద్యోగాలు పదోన్నతులు కూడా పొందే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

తుల రాశి:

తుల రాశివారికి సూర్యుడి సంచారం కారణంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. దీని కారణంగా వీరికి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా పుట్టుకు వస్తాయి. దీంతో పాటు సమయం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-07-26T10:04:28Z dg43tfdfdgfd