SUNDAY SPECIAL CHICKEN SALNA: రుచికరమైన చికెన్ సాల్నా ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా.?

Sunday Special Chicken Salna: సండే వచ్చిందంటే చాలు అందరి ఇళ్లలో చికెన్, మటన్, చేపలు వండుకుంటారు. ఇది ఎన్నో రోజులుగా వస్తోన్న ఆనవాయితీ. ఎందుకంటే ఆరోజు ఎక్కువ శాతం మందికి సెలవు కావడం. అయితే, చికెన్ తో తయారు చేసే రిసిపీలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అందుకే ఎప్పుడు ముందు వరుసలో ఉంటాయి చికెన్‌ రిసిపీలు. అయితే, ఎప్పుడు ఒకే విధమైన చికెన్ రిసిపీలు తయారు చేసుకుని బోర్‌ ఫీలవుతున్నారా? మరి ఈసారి కాస్త భిన్నంగా ఈ చికెన్‌ సాల్నా రెసిపీని తయారు చేసుకోండి. ఇది రోటీ, రైస్‌లలోకి బాగుంటుంది. ఈరోజు చికెన్ సాల్నా తయారీ విధానం, కావాలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

చికెన్ - 1/2 KG

పెద్ద ఉల్లిపాయ - 1

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 TBSp

కారం పొడి - 1 TBSp

టమోటాలు - 2

పచ్చిమిర్చి - 3

ధనియాల పొడి - 1 1/2 TBSp

జీలకర్ర పొడి - 1 TBSp

సోంపు - 1 TBSp

గసగసాలు - 3 TBSp

దాల్చిన చెక్క- 2 అంగుళాలు

లవంగాలు - 5

యాలకులు - 5

నూనె - 3 TBSp

కొత్తిమీర - కొద్దిగా

పసుపు పొడి - 1 TBSp

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - 2 TBSp

తురిమిన కొబ్బరి - 1 కప్పు

ఇదీ చదవండి: పుచ్చగింజల ఆయిల్‌తో ఈ మాస్క్‌ వేయండి.. మీ కురులు మెరిసిపోతాయి..  

చికెన్‌ సాల్నా తయారీ విధానం..

ముందుగా మసాలాను రుబ్బిపెట్టుకోవాలి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్‌ చేసి అందులో కొబ్బరి, సోంపు, గసాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క వేసి వేయించుకోవాలి. దీన్ని ఓ గ్రైండింగ్‌ జార్‌లోకి తీసుకుని మెత్తని పేస్ట్‌ మాదిరి తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పక్కన బెట్టుకోవాల.ఆ తర్వాత మరో ప్యాన్‌ తీసుకుని అందులో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయలు వేసి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.

ఇదీ చదవండి: Healthy Ragi Soup: రాగి సూప్‌.. ఆరోగ్యవంతంగా.. రుచిగా ఇలా తయారుచేసుకోండి..  

ఆ తర్వాత అందులోనే టమాటాలు, పసుపు, ఉప్పు, కారం పొడి వేసి నూనె పైకి తేలి టమాట మెత్తగా ఉడికే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న చికెన్‌ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. దీన్ని బాగా మాగబెట్టాలి. ఆ తర్వాత ఉప్పు వేసి బాగా కలిపి నూనె పైకి తేలే వరకు ఓ పది నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పడు మూత తీసి బాగా కలిపి మీ కూరకు సరిపడా నీరు పోసి మూత పెట్టి మీడియం మంటపై ఓ 20 నిమిషాలపాటు ఉడికించుకోవాలి. చివరగా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుని కొత్తిమీరాతో గార్నిష్‌ చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-04-27T06:07:50Z dg43tfdfdgfd