TILAK: మెడ, చేతులు, ఛాతీపై నామాలు ఎందుకు పెట్టుకుంటారు..? ఇంత సైన్స్ ఉందా..!

హిందూ మతంలో తిలకం, బొట్టు, నామాలకు చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని పవిత్రమైన గుర్తుగా పరిగణిస్తారు. మానవ శరీరంలో ప్రతి అవయవానికి ఒక దైవం అధిష్ఠానంగా ఉంటుందని నమ్ముతారు. నుదుటికి బ్రహ్మ దేవుడు అధిష్ఠాన దైవంగా ఉంటాడు కాబట్టి, నుదుటిని బ్రహ్మస్థానంగా భావిస్తారు. అందుకే నుదుటిపై బొట్టు పెట్టుకుంటారు. ముఖ్యంగా వైష్ణవులు, శైవులు నుదుటిపై నామాలు పెట్టుకుంటారు. అలాగే చేతులు, ఛాతీపై కూడా నామాలు దిద్దుకుంటారు. దీని వెనుక అనేక ప్రాముఖ్యతలు, లాభాలు ఉన్నాయి.

తిలక ధారణ పద్ధతి వ్యక్తి మతం, సంప్రదాయం ఆధారంగా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా నుదుటి మధ్య భాగంలో బొట్టు పెట్టుకుంటారు. అయితే కొంతమంది మెడ, చెయ్యి, ఛాతీపై కూడా నామాలు ధరిస్తారు. శరీరంలోని ఈ స్థానాలలో తిలక, నామ ధారణ చేయడం చాలా మంచిదని పండితులు చెబుతారు.

* మెడపై తిలకం

మెడపై తిలకం ధరించడం హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. మెడను ఒక పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడ తిలకం లేదా బొట్టు పెట్టుకుంటే శుభం కలుగుతుందని నమ్ముతారు. ఇది తల (బుద్ధి)ని మిగిలిన శరీరానికి కలుపుతుంది. మన ఆలోచనలు, చర్యల మధ్య సమతుల్యతను సృష్టిస్తుంది. సాధారణంగా ప్రసంగం (Speech) గొంతు నుంచి, అన్నవాహికకు దగ్గరగా వెళుతుంది. మెడపై తిలకం ధరించడం ద్వారా ప్రసంగాలకు గౌరవం, ప్రాముఖ్యతను ఇచ్చినట్లు అవుతుంది. ఇలా చేస్తే మాటలు మరింత స్పష్టంగా, మృదువుగా, శ్రావ్యంగా వినిపిస్తాయని కూడా నమ్ముతారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మెడ అంగారక గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. మెడ చుట్టూ తిలకం ధరించిన వారి జీవితంలో అంగారక గ్రహం బలం పెరుగుతుంది. ఫలితంగా వారిలో ధైర్యం, తేజస్సు, దృఢత్వం వంటి గుణాలు పెరుగుతాయని నమ్ముతారు. మెడపై తిలకం ధరిస్తే గొంతు కామ్ అయిపోయింది. మాటలు మధురంగా, సామరస్యంగా మారతాయి. ఈ మధురమైన మాటలతో మనం ఇతరులతో మెరుగైన సంభాషణ చేస్తూ సంబంధాలను బలపరుచుకోవచ్చు.

---- Polls module would be displayed here ----

* చేతిపై నామాలు

చెయ్యి శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. చేతిపై తిలకం, నామధారణ చేస్తే జీవితంలో శుక్రుడి సానుకూల ప్రభావాన్ని పెంచుకోవచ్చని నమ్ముతారు. శుక్రుడు ప్రేమ, సౌందర్యం, సంపదకు కారకం. అందుకే చేతిపై, భుజాల దగ్గర నామాలు పెట్టుకుంటే ఈ లక్షణాలను మెరుగుపడతాయని భావిస్తారు. ఒక వ్యక్తి జ్యోతిష్య పట్టికలో శుక్రుడు బలహీనంగా ఉంటే, చేతిపై నామాలు దిద్దుకుని దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇది అదృష్టం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు.

* ఛాతీపై నామాలు

దేవుడు మన ఛాతీలో నివసిస్తాడని నమ్ముతారు. ఛాతీలో ఉన్న హృదయం దేవుని నివాసంగా భావిస్తారు. అందుకే ఛాతీపై నామాలు, విభూది దిద్దుకుంటారు. తద్వారా మనలో నివసించే పరమాత్మ పట్ల భక్తిని చాటుకోవచ్చు. ఛాతీ భావోద్వేగ స్థిరత్వానికి కేంద్రం. ఇక్కడ నామాలు ధరిస్తే భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. జీవితంలో ఖగోళ వస్తువుల ప్రభావాన్ని సమన్వయం చేయవచ్చు. సానుకూల శక్తులను ఆకర్షించవచ్చు. ఛాతీపై నామాలు దిద్దుకుంటే సూర్యుడి శక్తిని గ్రహించవచ్చు, మనలోని ఆత్మశక్తిని పెంచుకోవచ్చు.

ఛాతీపై ఉన్న తిలకం మనస్సుపై ప్రశాంతత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ప్రశాంతత, కరుణ, సానుకూల ఆలోచనలను పెంచుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, నిర్ణయాలు తెలివిగా తీసుకుంటారు. భగవంతుడు హృదయంలో ఉంటాడని నమ్ముతారు కాబట్టి, ఛాతీపై తిలకం దిద్దుకోవడం అనేది మనలోని దైవిక సన్నిధికి నేరుగా గౌరవాన్ని అందించినట్లే అవుతుంది.

2024-03-29T04:45:34Z dg43tfdfdgfd