VENUS TRANSIT 2024: సెప్టెంబర్ 18న నీచరాశి నుంచి తులా రాశిలోకి శుక్రుడు ఈ రాశుల వారికి ఊహించని డబ్బు..

Venus Transit In Libra 2024 In Telugu: జ్యోతిష శాస్త్ర ప్రకారం అన్ని గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. ఈ సంచారాలే మానవుల వ్యక్తిగత జీవితాల పై ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాలు సంచారం చేయడం కారణంగా కొందరికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా గ్రహ మార్పుల ప్రభావం దేశం తో పాటు ప్రపంచంపై కూడా చూపుతోందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో ఎంతో ప్రత్యేకత కలిగిన మేష శుక్ర గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ఇదిలా ఉంటే శుక్ర గ్రహం ఏ రాశిలోనైనా దాదాపు 26 రోజుల పాటు సంచార దశలో ఉంటాడు. అయితే ఈ సంచారం కారణంగా మేష రాశి నుంచి మీన రాశి వరకు ప్రత్యేకమైన ప్రభావం పడుతూ ఉంటుంది. 

ముఖ్యంగా శుక్ర గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా అనేక ఫలితాలు కలుగుతాయి. అదే ఈ గ్రహం అశుభ స్థానంలో ఉన్నవారికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయని జ్యోతిష శాస్త్రంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే భాద్రపదం శుక్లపక్ష పూర్ణిమ తిథి బుధవారం సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 8 గంటలకు శుక్రుడు నీచ రాశి అయిన కన్యా రాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించడం వల్ల మేష రాశి తో పాటు పది రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్రాన్ని పనులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశుల వారికి వృత్తి వ్యాపార జీవితాలలో అనుకూల ఫలితాలు కలుగుతాయి. 

శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర కుంభ వృశ్చికతుల కన్య సింహరాశి తో పాటు ఇతర రాశుల వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో మార్పులు వచ్చి సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతే కాకుండా జీవితంలో సంతోషం పెరిగి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలిగే శక్తిని పొందుతారు. అలాగే ఈ పది రాశుల వారికి ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతోపాటు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ రాకుల వారికి ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. 

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడు తన సొంత రాశి అయిన తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే అక్టోబర్ 13వ తేదీ వరకు అదే రాశిలో సంచార దశలో ఉంటాడు ఆ తర్వాత ఈ గ్రహం తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. అయితే దీని కారణంకా కూడా మొత్తం 12 రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది శుక్రుడు వృశ్చిక రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారు మరిన్ని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా దీని చెడు ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు నష్టాలు కూడా పొందవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

2024-09-07T06:08:09Z dg43tfdfdgfd