WATERFALLS: ఆ ఘాట్ అందాలకు ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే

ఎత్తైన కొండలు… చిక్కని పచ్చని అడవులు… ఆ అడవుల మధ్య స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు... కొండలపై నుండి జాలువారే జలపాతాలు… ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రకృతి రమణీయతలకు పెట్టింది పేరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని అడవులు, కొండలు, గుట్టలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. అయితే ఎటు చూసినా కనిపిస్తున్న ఆ పచ్చదనాన్ని చీల్చికుంటూ పర్వత ప్రాంతం మధ్య వంపులు తిరుగుతూ వెళుతున్న నల్లటి రహదారి పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

అదే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల మధ్య సహ్యాద్రి పర్వప్రాంతంలో ఉన్న మహబూబ్ ఘాట్. నిర్మల్ నుండి ఆదిలాబాద్ వైపు బయలుదేరిన క్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం రాణాపూర్ గ్రామం దాటిన తర్వాత ఈ మహబూబ్ ఘాట్ మొదలవుతుంది. దాదాపు ఐదు కిలోమీటర్లు కొండల మధ్య వంకరలు తిరుగుతూ సాగుతుంది. పచ్చని కొండలు, వాటిని తాకుతూ కదులుతున్న మేఘాలు, వాటికి తోడు చిటపట రాలుతున్న వాన చినుకులతో ఈ మహబూబ్ ఘాట్ అందాలు ఊటిని మరిపిస్తున్నాయి.

Bhadrakali Cheruvu: ఉప్పొంగుతున్న భద్రకాళి చెరువు... జలపాతం చూసేందుకు క్యూ

ఆ దారి వెంట వెళుతున్న పర్యాటకులు ఈ మహబూబ్ ఘాట్ అందాలను ఫిదా అవుతున్నారు. ప్రయాణం మధ్యలో కొద్ది ఘాట్ పై ఆగి సేదదీరి, అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించి వెళుతున్నారు. మరికొందరు మహబూబ్ ఘాట్ అందాలను తమ సెల్ఫోన్ లలో బంధిస్తే, మరికొందరు సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు.

---- Polls module would be displayed here ----

మరోవైపు వంపులు తిరుగుతున్న ఘాట్ మూల మలుపుల వద్ద వానరాలు కవ్విస్తూ వచ్చి పోయే ప్రయాణికులకు మరింత ఆనందాన్నిస్తున్నాయి. మరోవైపు ఈ ప్రాంతంలో నెమళ్లు కూడా పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఈ ఘాట్‌కు ఆనుకొని కొద్ది దూరంలో అడవిలో జాలువారుతున్న సెలయేరు కూడా కనువిందు చేస్తోంది. మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్న ఇక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఇక్కడి ప్రకృతి అందాలు ఊటి, కొడైకెనాల్ లను గుర్తు చేస్తున్నాయి.

Instagram Business Idea: ఇన్‌స్టాగ్రామ్‌లో సింపుల్ బిజినెస్... నెలకు రూ.75,000 సంపాదిస్తున్న యువతి

ఒకవైపు ఎతైన కొండలు.. మరోవైపు దట్టమైన అడవులు.. పచ్చదనాన్ని చీల్చుతున్న పోతున్న నల్లటి రహదారులు.. ఈ అందాలను చూస్తే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. ఈ అందాల్ని ఆస్వాదించాలంటే ఈ సీజన్ లో ఒక్కసారైన ఈ మహబూబ్ ఘాట్ ను సందర్శించాల్సిందే.

2024-07-26T12:00:23Z dg43tfdfdgfd