WEEKLY HOROSCOPE | ( 8.9.2024 నుంచి 14.9.2024 వరకు )

మేషం

తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. వినాయకుడికి బెల్లం లడ్డూలు నివేదించండి.

వృషభం

చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు అందుకుంటారు. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త పాటించండి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. విదేశీ విద్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ప్రభుత్వ పనుల్లో జాప్యం జరుగుతుంది. గణపతికి కొబ్బరిలడ్డూ నైవేద్యంగా పెట్టండి.

మిథునం

అదృష్టం కలిసివస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఖర్చుల నియంత్రణ అసవరం. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విఘ్నేశ్వరుడికి వడపప్పు, పానకం గణపతికి నివేదనగా సమర్పించండి.

కర్కాటకం

ఉద్యోగులకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం అవసరం. స్నేహితులతో కొన్ని పనులు నెరవేరుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రాబడి పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. లంబోదరుడికి పాయసం నివేదించండి.

సింహం

తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. డబ్బు చేతికి అందుతుంది. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఏకదంతుడికి ఖర్జూర పాయసం సమర్పించండి.

కన్య

వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త అవసరం. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. తీర్థయాత్రలు చేపడతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. యాలకులు, పెసరపప్పుతో చేసిన పదార్థం వినాయకుడికి నివేదించండి.

తుల

శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉంటారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. అయితే ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారంతో పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పాలపొడితో తయారు చేసిన లడ్డూలు గణపతికి సమర్పించండి.

వృశ్చికం

రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు న్యాయపరమైన ఇక్కట్లు తొలగిపోతాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పనులలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. బెల్లం లడ్డూలూ గణపతికి నివేదించండి.

ధనుస్సు

ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. శనగపిండితో చేసిన లడ్డూలు విఘ్నేశ్వరుడికి సమర్పించండి.

మకరం

ఉద్యోగ, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల అదరణ లభిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. నువ్వుల లడ్డూలు గణపతికి నైవేద్యంగా పెట్టండి.

కుంభం

ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. అనవసరమైన ఆలోచనలతో ప్రశాంతత లోపిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు పై అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. సాహితీవేత్తలకు, కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. నువ్వులతో చేసిన తీపి పదార్థాలు గణపతికి సమర్పించండి.

మీనం

శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వినాయకుడికి బూందీలడ్డూలు నివేదించండి.

-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి

ఎం.ఎస్సీ., నిర్మల్‌ పంచాంగకర్త

నల్లకుంట, హైదరాబాద్‌. సెల్‌: 9885096295

ఈ మెయిల్‌ : [email protected]

2024-09-07T21:10:36Z dg43tfdfdgfd