WIFE FOR RENT | ఇక్కడ భార్యలు అద్దెకు లభించును.. ధర కేవలం..

Wife for Rent | భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని శివపురిలో మహిళల సంత జరుగుతుండటం అందరినీ కలచివేస్తున్నది. ధడీచా పేరుతో కొనసాగుతున్న ఈ తిరోగమన ఆచారం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. ఈ సంతలో యువతులు, మహిళలను అద్దెకు ఇస్తారు. నచ్చిన యువతి/మహిళను నెలలు, సంవత్సరాల కోసం అద్దెకు తీసుకుంటారు. ఆమె కుటుంబ సభ్యులు, అద్దెకు తీసుకునేవారు స్టాంపు పేపర్లపై ఒప్పందం రాసుకుంటారు.

పెండ్లి చేసుకోవడానికి తగిన యువతి దొరకనివారు, తమ ఇండ్లలోని వయోవృద్ధుల సంరక్షణ కోసం మహిళలు అవసరమైనవారు ఈ విధంగా ఒప్పందాలు చేసుకుంటారు. అద్దె రూ.15,000 నుంచి ప్రారంభమై, కొన్ని లక్షల వరకు ఉండవచ్చు. కన్యలకు ఎక్కువ ధర ఉంటుందని, అయితే ఈ ఒప్పందాన్ని తిరస్కరించే హక్కు మహిళలకు ఉంటుందని స్థానికులు చెప్తున్నారు.

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌

ఆన్‌లైన్లో ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువును మరోసారి పొడిగించారు. ఆధార్‌లో మార్పులు, చేర్పులు ఉచితంగా చేసుకోవడానికి గడువు ఈ నెల 14న ముగియడంతో పౌరులకు ఈ సౌకర్యాన్ని మరికొంత కాలం కొనసాగించడం కోసం ఈ ఏడాది డిసెంబర్‌ 14 వరకు దీనిని పొడిగిస్తున్నట్టు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) శనివారం వెల్లడించింది. ఆధార్‌ కార్డులు తీసుకుని గత పదేండ్లు దాటి అప్పటి నుంచి చిరునామా, ఇతర వివరాలు అప్‌డేట్‌ చేసుకోని పౌరులు వాటిని ఉచితంగా అప్‌డేట్‌ ‘మై ఆధార్‌ పోర్టల్‌’లో చేసుకోవాలని యూఐడీఏఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

2024-09-15T01:13:29Z dg43tfdfdgfd