అంగన్వాడీ గుడ్డులో పురుగులు

అంగన్వాడీ గుడ్డులో పురుగులు

యాదాద్రి, వెలుగు: అంగన్వాడీ గుడ్డులో పురుగులు వచ్చినట్టు ఓ వీడియో వైరల్ కావడంతో అధికారులు రంగంలోకి దిగారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని బంజారాహిల్స్‌‌ అంగన్వాడీ నుంచి మూడేండ్ల చిన్నారి అభినాయక్​కు పౌష్టికాహారం కింద శనివారం 15 గుడ్లు అందించారు. ఈ గుడ్లతో వంట చేయడానికి సదరు కుటుంబసభ్యులు బుధవారం ప్రయత్నించగా, ఓ గుడ్డులో పురుగులు కన్పించాయి.

దీంతో  చిన్నారి తండ్రి భూక్యా సక్కునాథ్ ఫొటో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. విషయం తెలుసుకున్న సీడీపీవో స్వరాజ్యం విచారణలో భాగంగా సక్కునాథ్ ఇంటికి వెళ్లి పురుగులు వచ్చిన గుడ్డును పరిశీలించారు. అనంతరం మరికొన్ని గుడ్లను పగలకొట్టి చూశారు. అయితే, ఏ గుడ్డులోనూ పురుగులు రాలేదు. తాము కొత్త స్టాకే పంపిణీ చేశామని, పురుగులు ఎలా వచ్చాయో తెలియదని ఆమె చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారులకు వివరిస్తామని సీడీపీవో తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై విచారణ జరుపుతామని డీడబ్ల్యూవో కృష్ణవేణి తెలిపారు. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-07-25T05:58:23Z dg43tfdfdgfd