అంతుచిక్కని రహస్యాలతో నది ఆలయం.. పక్కనే అడవిలో జలపాతం.. చూస్తే థ్రిల్ అవ్వాల్సిందే!

పచ్చని నల్లమల్ల అడవి అందాల నడుమ ప్రకృతి సోయగాలతో ఆకట్టుకుంటున్న జలపాతం అందాలు చూస్తే మాత్రం మైమరచి పోవాల్సిందే. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఒకవైపు జలాశయాలని వరద నీటితో జలకళను సంతరించుకుంటే మరోవైపు ప్రకృతి సోయగాల నడుమ జాలువారే జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎత్తైన కొండల నుంచి జాలవారే జలపాతాలు నురగలు కక్కుతూ కిందకి దూకే దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం ఇలాంటి జలపాతాలే నంద్యాల జిల్లాలో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు కమ్ముకున్న కారు మబ్బులు మరోవైపు పచ్చని ప్రకృతి అందాల నడుమ దివి నుంచి భువికి దూకుతున్న జల సవ్వడలను చూసేందుకు రెండు కన్నులు చాలవన్నట్లుగా ప్రకృతి ప్రేమికులను ఇట్లే కట్టిపడేస్తున్నాయి. నంద్యాల జిల్లాలోని దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో పచ్చని చెట్ల నడుమ కమ్ముకున్న కారు మబ్బులలో ఎత్తైన కొండల నుంచి జాలవారే జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఇలాంటి జలపాతాలపై లోకల్ 18 ప్రత్యేక కథనం.

నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని నల్లమల్ల అడవి రేంజ్ ఫారెస్ట్లో ఉన్న శివపురం గ్రామ సమీపంలోని కొలనుభారతి క్షేత్రం వద్ద ఉన్నటువంటి చారుఘోషిని జలపాతం పర్యాటకులను ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రంగానూ మరోవైపు పర్యాటక కేంద్రంగానూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ఆలయంగాను ప్రసిద్ధి చెందిన ఆలయం కొలనుభారతి క్షేత్రం దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో వెలసిన సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకున్న భక్తుల పాలిట పెన్నిదిగా మారినా కొలనుభారతి క్షేత్రంలో ప్రస్తుతం వర్షాకాలం కావడంతో చెరుఘోసిని జలపాతం అందాలు ఔరా అనిపిస్తున్నాయి.

రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి ఎస్‌బీఐ అదిరే గుడ్ న్యూస్..

నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలోని శివపురం గ్రామ సమీపంలోని దట్టమైన నల్లమల్ల అడవిలో వెలసిన సరస్వతి దేవి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం భక్తులు అడవిలో ఉన్నటువంటి జలపాతాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయం నుంచి సుమారు 6 కిలోమీటర్ దూరం మేర దట్టంగా కమ్ముకున్న పచ్చని చెట్ల నడుమ పాదయాత్ర చేస్తూ ఈ జలపాతాలను చేరుకుంటున్నారు. చెరుఘోసిని నదిగా పిలవబడే ఈ కొలనుకు ఎంతో ప్రత్యేకత ఉంది.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు! ఎప్పుడెప్పుడంటే..

---- Polls module would be displayed here ----

అంతు చిక్కని రహస్యాలతో ఈ నది ఆలయం నుంచి ఒక కిలోమీటర్ మేరా మాత్రమే ప్రవహించి అంతర్గతమవుతుందని ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు భక్తులు తెలుపుతున్నారు. ఎన్నో వింతలు విశేషాలకు పుట్టినిల్లు అయినటువంటి నల్లమల్ల అడవి ప్రాంతంలో అంత చిక్కని రహస్యాలతో అడవి అందాలను తిలకించాలంటే మాత్రం నంద్యాల జిల్లాకు రావాల్సిందే. పూర్వపు ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుత నంద్యాల జిల్లాగా పిలవబడే ఈ ప్రాంతంలో ఎన్నో అంత చిక్కని రహస్యాలు చారిత్రాత్మకమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు సైన్సు కూడా అంత చిక్కని రహస్యాలకు పుట్టినిల్లుగా ఈ ప్రాంతం విరాజిల్లుతుంది.

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నల్లమల అడవి ప్రాంతంలో చాలాచోట్ల జాలువారే జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే లోకల్ 18 అన్వేషణలో భాగంగా సేకరించినటువంటి ఈ అద్భుతమైన దృశ్యాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఒక వైపు ఆధ్యాత్మిక కేంద్రంగా భక్తి భావంతో అమ్మవారిని దర్శించుకున్న వారికి ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే మాత్రం నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం శివపురం గ్రామ సమీపంలో ఉన్న కొలను భారతీ క్షేత్రానికి రావాల్సిందే.

2024-07-27T06:33:29Z dg43tfdfdgfd