ఆ ఊళ్లో వినాయకుడొక్కడే !

  • 32 ఏళ్లుగా ఒక్కచోటనే విగ్రహ ప్రతిష్ఠాపన
  • ఆదర్శంగా నిలుస్తున్న సూరంపేట గ్రామస్తులు

శాయంపేట, సెప్టెంబర్‌ 14 : వినాయక చవితి పండుగ వచ్చిందంటే వాడవాడకు గణనాథుల విగ్రహాలు కొలువుదీరుతాయి. ఒకప్పుడు కాలనీ మొత్తం ఒకటీ రెండు మాత్రమే ఉండగా ఎవరికి వారు విగ్రహాలు పెడుతుండడంతో ఏటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉన్నది.

కానీ హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని సూరంపేటలో మాత్రం ఇందుకు భిన్నంగా ఊరంతా ఒక్క వినాయకుడే కనిపిస్తాడు. గ్రామ ప్రజలంతా కలిసికట్టుగా 32 ఏళ్ల నుంచి ఒకేచోట విగ్రహాన్ని ఏర్పాటుచేసి నవరాత్రి సంబురాలను జరుపుకొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక రు విగ్రహం ఇస్తే.. మరికొందరు అన్నదానం చేస్తారని బీఆర్‌ఎస్‌ నేత అడుప ప్రభాకర్‌ చెప్పారు.

2024-09-14T21:28:28Z dg43tfdfdgfd