ఆకర్షిస్తున్న 10 అడుగుల ఎత్తైన చాక్లెట్ వినాయకుడు!

శ్రీకాకుళంలోని అంపోలు గ్రామంలో చాక్లెట్లతో తయారుచేసిన ఒక వినాయకుని ప్రతిష్టించడం జరిగింది. ఈ వినాయకుడు తయారీకి 40 కేజీల వరకు చాక్లెట్లు వాడారు. ఆ వినాయకుడి ప్రత్యేకతలు లోకల్ 18 ద్వారా తెలుసుకుందాం. శ్రీకాకుళం పట్టణం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంపోలు గ్రామంలోని దిగువ వీధి గణేష్ యూత్ ప్రతి సంవత్సరం వినూత్నంగా వినాయకుని తయారుచేసి మండపంలో పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వినాయకుని ప్రత్యేకించి చాక్లెట్లతో తయారుచేసి 10 అడుగులు ఎత్తైన చాక్లెట్ గణేష్ విగ్రహాన్ని మండపంలో పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ చాక్లెట్లు వినాయకుని తయారీకి సుమారు నలభై కేజీల చాక్లెట్లు వాడి ఈ వినాయకుడిని తయారు చేశారు.

అంపోలు గ్రామంలోని ప్రసాద్ అనే శిల్పకారుడు తయారు చేశారు. ఈయన స్వతహాగా ఒక ఆర్టిస్ట్. ఈయన అంపోలు దిగువ వీధి ఉన్న గణేష్ కమిటీ కుర్రాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం వినూత్నంగా ఒక వినాయకుని తయారు చేశారు. 2023 సంవత్సరంలో ఐస్ క్రీమ్ స్పూన్స్ తో వినాయకుడు తయారు చేశారు. ఈ సంవత్సరం చాక్లెట్ వినాయకుని తయారు చేశారు. ఈ చాక్లెట్ వినాయకుడు తయారీ 40 కేజీల వివిధ రకాల చాక్లెట్ తో పది అడుగులు ఎత్తైన చాక్లెట్ గణేష్ తయారు చేశారు.

18 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న మహిళలకు భారీ శుభవార్త.. ఉచితంగానే..

ఈ చాక్లెట్ గణేష్ తయారీకి వాడిన చాక్లెట్లు స్నికర్స్, మంచ్, మిల్కీస్, కూల్ ఫ్రెష్, కాఫీ చాక్లెట్స్ మొదలగునవి ఈ గణనాథుడు తయారీకి వాడారు. లాలూ అనే కుర్రవాడు ఈ గణేష్ ను సుందరంగా తయారు చేశారు. ఈ గణనాథుడిని దర్శించేందుకు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల నుండి ప్రజలు వస్తున్నారు. ఈ ప్రసాద్ అనే ఆర్టిస్టుకు ఈ చాక్లెట్ విగ్రహం తయారీకి సుమారుగా 10 రోజులు సమయం పట్టింది. కంటిన్యూస్ గా రోజుకి ఐదు గంటలు చొప్పున పని చేయగా పది రోజులు పాటు ఈ చాక్లెట్లను గమ్ తో వినాయకుడి యొక్క ఫ్రేమ్ కి అంటించడానికి సమయం పట్టిందని ప్రసాద్ తెలియజేశాడు.

ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఉచితంగానే రూ.10 లక్షల నుంచి కోటి రూపాయలు!

---- Polls module would be displayed here ----

ఈ అంపోలు గ్రామంలో ఈ చాక్లెట్ గణనాథుడిని పదిహేను రోజులు పాటు ఇక్కడ గ్రామంలో ఉంచి పూజలు నిర్వహిస్తారు. ఈ పదిహేను రోజులు పాటు నిత్యం ఉదయం, సాయంత్రం కుంకుమ పూజలు నిర్వహిస్తారు. పదిహేను రోజులు అనంతరం గణనాథుని చాక్లెట్లను తీసి ప్రసాదంగా గ్రామం మొత్తం పంచిపెడతాం అని కమిటీ కుర్రాళ్ళు లోకల్ 18 కు తెలియజేసారు.

2024-09-07T13:18:05Z dg43tfdfdgfd