ఆడవారు ఎక్కువగా సింగిల్‌గా ఉండడానికి కారణాలివే..

నేటి కాలంలో కొంతమంది మహిళలు సింగిల్‌గా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనికి చాలానే కారణాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

కొన్ని రోజుల ముందు మగవారు సింగిల్‌గా ఉండడానికి ఇష్టపడితే.. కాలం మారి ఇప్పుడు ఆడవారు కూడా ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతున్నారు. దీనికి చాలానే కారణాలున్నాయి. అవేంటో తెలుసుకోండి. సెట్ కాకపోవడం..

అందరికీ ఒకే ఇష్టాలు ఉండవు. ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి ఉంటుంది. అందుకే, తాము కోరుకున్న లక్షణాలు లేకపోవడంతో ఆడవారు సింగిల్‌గానే ఉంటున్నారు. అదే విధంగా, వారిలో కొన్ని గుణాలను కోరుకుంటారు. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్, సూటిగా మాట్లాడడం, మర్యాద ఇవ్వడం.. ఇలాంటి చాలా అంచనాలతో ఉంటారు. వీటిలో ఏం లోపించినా పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడతారట.

ఒంటరిగా ఉండడం..

చాలా మంది ఆడవారిలో ఇప్పుడు మార్పొచ్చింది. తమకి సెట్ కాని వారితో రోజూ బాధపలు పడుతూ ఉండే బదులు ఒంటరిగానే ఉండడం మంచిదని అనుకుంటున్నారు మహిళలు. పెళ్ళి తర్వాత వచ్చే కష్టాలకు భయపడి ఒంటరిగా ఉంటున్నారు.

అనుమానంగా అనిపించినా..

కొంతమంది ఆడవారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తారు. ఎదుటివారిలో ఏవైనా విషయాలు అనుమానంగా అనిపించినా వారికి మళ్ళీ ఎలాంటి అవకాశమివ్వరు. వారి జీవితంలో ఉండనివ్వరు.

గోల్స్ రీచ్ అవ్వడానికి..

ఆడవారు కొన్ని గోల్స్‌ని అనుకుంటారు. వాటి గురించే ఎప్పుడు ఆలోచిస్తారు. వాటిని రీచ్ అవ్వడానికి నిరంతరం ఆలోచిస్తూ ఆ పనితోనే ప్రేమలో పడతారు. కాబట్టి, పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడరు. అదేవిధంగా, స్వేచ్ఛని కోరుకునే ఆడవారు పెళ్ళి తర్వాత కూడా అదే విధంగా స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. పెళ్ళి తర్వాత అలాంటి స్వేచ్ఛ దూరమవుతుందని భయపడి పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడతారు.

విడిపోతారనే భయం..

నేటి కాలంలో చాలా మంది పెళ్ళి చేసుకుని విడిపోతున్నారు. ఇలా వారి జీవితంలో కూడా జరగొద్దని వారు ఆ తప్పుని చేయొద్దని పెళ్ళికి దూరంగానే ఉండిపోతున్నారు.

​Read More : Relationship News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-25T12:16:43Z dg43tfdfdgfd