ఈ ఆరు రాశుల వారికి వచ్చే నెలాఖరు వరకు దేనికి లోటు ఉండదు

Astrology: ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 23 వరకు శృంగార దేవత, సుఖ సంతోషాలకు కారకుడు, ఐశ్వర్య కారకుడు, అపర లక్ష్మీ దేవి అయిన శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ పట్టడం జరుగుతోంది. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడంతోనే ఆరు రాశులకు మహా భాగ్య యోగం కలిగిస్తాడు. శుక్రుడు తనకు ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలోకి ప్రవేశించడం అన్నది వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశులకు అన్ని విధాలు గానూ పండగే. అధికార యోగం కలగడంతో పాటు, భోగభాగ్యాలు కలగడం, సుఖ సంతోషాల్లో మునిగి తేలడం జరుగుతుంది. ఇందులో మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు ఉచ్ఛ శుక్రుడు మాలవ్య మహా పురుష యోగాన్నికలగజేస్తుండగా, వృషభ, తులా రాశులకు మహా భాగ్య యోగం కలిగిస్తున్నాడు.

వృషభం: 

ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానమైన మీన రాశిలో ఉచ్ఛపట్టడం వల్ల

దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి

మెరుగుపడుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం

పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారాలు

లాభదాయకంగా ముందుకు సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కా రమవుతాయి.

ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి.

మిథునం:

ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్రుడు ఉచ్ఛపట్టినందువల్ల ఈ రాశివారికి మాలవ్య

మహా పురుష యోగం ఏర్పడింది. ఈ యోగం పట్టిన జాతకులు సమాజంలో ఒక ప్రముఖ

వ్యక్తిగా చెలామణీ కావడం జరుగుతుంది. తప్పకుండా ధన ధాన్య వృద్ధి ఉంటుంది.

అనేక మార్గాల్లో ఆదాయం పెరగ డంతో పాటు, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. భోగభాగ్యాలను అనుభవిస్తారు. నిరుద్యోగులు

ఆశించిన ఉద్యోగంలో చేరతారు. అనేక విధాలుగా వైభవం పెరుగు తుంది.

కన్య:

ఈ రాశివారికి సప్తమ కేంద్రంలో శుక్రుడు ఉచ్ఛలోకి వస్తున్నందువల్ల, మాలవ్య

మహా పురుష యోగం ఏర్పడింది. ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఒక వెలుగు

వెలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సర్వత్రా వీరి ప్రాధాన్యం,

ప్రాభవం పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి.

ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నం చేపట్టినా కలిసి

వస్తుంది. లక్ష్మీదేవి కటాక్ష వీక్షణాలు లభిస్తాయి. సంపద బాగా

పెరుగుతుంది.

తుల:

ఈ రాశ్యధిపతి అయిన శుక్రుడు ఉచ్ఛపట్టినందువల్ల ఈ రాశివారికి ప్రాభవం

పెరుగుతుంది. అనేక వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య, ఆస్తి సంబంధమైన

సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశముంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార

యోగానికి అవకాశముంది. వ్యాపారాల్లో అంచనా లకు మించి లాభాలు పెరుగుతాయి.

విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లేదా రాజకీయ

ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. శుభవార్తలు వింటారు.

ధనుస్సు:

ఈ రాశికి చతుర్థ కేంద్రంలో శుక్రుడి ఉచ్ఛ స్థితి వల్ల ఈ రాశివారికి

మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. వీరికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం

అవుతుంది. మనసులోని కోరికలు నెర వేరుతాయి. గృహ, వాహన సౌకర్యాలకు

అవకాశముంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు పెరుగుతాయి. ఆస్తి

కలిసి వస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సామాజికంగా కూడా హోదా

పెరుగుతుంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగుతాయి. విలాస జీవితం అనుభవిస్తారు.

మీనం:

ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి కూడా మాలవ్య మహా

పురుష యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల ఈ రాశివారికి తప్పకుండా అన్ని విధాలు

గానూ ఉచ్ఛస్థితి కలుగు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో వీరికి అధికారయోగం

పడుతుంది. జీతభత్యాలు ఆశించిన దానికి మించి పెరుగుతాయి. వ్యాపారాల్లో

లాభాలకు కొదవ ఉండదు. అనేక మార్గాల్లో సిరి సంప దలు కలుగుతాయి. విలాస

జీవితం అనుభవిస్తారు. మంచి రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి.

Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)

2024-03-27T16:27:06Z dg43tfdfdgfd