ఈ చిన్న పని చేసుకుంటూ.. నెలకు రూ.35 వేల సంపాదన.. ఆ సీక్రెట్ ఇదే..

కేవలం రెండు లక్షల రూపాయలతో తన మిత్రులతో కలిసి హోమ్ డెకరేట్ షాపును ప్రారంభించాడు తిరుపతనే వ్యక్తి. ప్రస్తుతం నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..? మీ ఇంటిని మరింత అందంగా మార్చుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ సమాచారం, ప్రత్యేక కథనం మీకోసమే అందిస్తోంది లోకల్18.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో స్కై వరల్డ్ హోమ్ డెకరేషన్ షాప్ లో అన్ని రకాల వాల్ పేపర్స్, గ్రౌండ్, వాల్ మ్యాట్స్ అందుబాటులో ఉన్నాయని వాటితోపాటు PVC 3D ప్యానెల్స్ కూడా అందుబాటులో ఉన్నాయని డెకరేషన్ షాప్ యజమాని తిరుపతి లోకల్18 తో మాట్లాడారు. ఆర్టిఫిషియల్ గ్రాస్, విండోస్ కార్టెన్స్ అన్నిరకాల హోమ్ డెకర్ కు సంబంధించిన మెటీరియల్స్ అందుబాటులో రీజనబుల్ ధరల్లో అందిస్తున్నామని తెలిపారు.

బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామానికి చెందిన తిరుపతనే వ్యక్తి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చలర్ గా పనిచేస్తున్నారు. MSC (ఫిజిక్స్) వరకు చదువుకున్నట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాల క్రితం మల్లారం గ్రామానికి చెందిన తన స్నేహితులు కళ్యాణ్ తో కలిసి వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ సమీపంలో స్కై వరల్డ్ హోమ్ డెకర్స్ షాపును రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసినట్లు తిరుపతి వెల్లడించారు.

ప్రతినెల రూ. 30వేల నుంచి 35 వేల వరకు అన్ని పోగా ప్రాఫిట్ వస్తుందని లోకల్18కి తెలిపారు. రెండు లక్షల రూపాయలతో ఈ షాప్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏర్పాటుచేసిన కొత్తలో కొంతవరకు గిరాకీ తగ్గినా రాను రాను వేములవాడ పట్నం తో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా తమ తమ ఇండ్లను మరింత అందంగా మార్చుకునేందుకు ఆసక్తి చూపుతుండడంతో గిరాకీ పెరిగిందని తిరుపతి లోకల్ 18కి వివరించారు.

చాలా తక్కువ ధరల్లో నాణ్యమైన వాల్, గ్రౌండ్ మ్యాట్స్, PVC ప్యానెల్స్, ఆర్టిఫీషియల్ గ్రాస్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ధరల వివరాలు ఇలా ఉన్నాయి..

వాల్ మాట్స్ ఫిట్ కు రూ.25 నుంచి ఉన్నాయని, ప్యానెల్స్ ఫిట్ రూ.60, ఫ్లోర్ మ్యాట్ ఫిట్ రూ.30 గా ఉందని అలాగే విండో కర్టెన్స్ రూ. 70 గా అమ్మకాలు జరుగుతున్నామని యజమాని తిరుపతి చెప్పారు.

ఎవరికైనా రెస్టారెంట్, ఇల్లు, ఆఫీసుల్లో మరింత అదనపు ఆకర్షణగా ఉండాలంటే.. 9866560565 నెంబర్ కు సమాచారం ఇచ్చినా.. మీ అడ్రస్సు కు మేమే వచ్చి కొలతలు తీసుకుని పనిచేసి సకాలంలో ఇస్తామని తెలిపారు. ఆఫీస్, రెస్టారెంట్స్, ఇండ్లను మరింత అందంగా తయారు చేసేందుకు వాల్ పేపర్స్, మ్యాట్స్, కటెన్ విండోస్, ఆర్టిఫిషియన్ గ్రాస్, PVC ప్యానెల్స్ ద్వారా మరింత అందంగా కనువిందు చేస్తాయని యజమాని తిరుపతి పేర్కొన్నారు.

2024-07-27T13:19:32Z dg43tfdfdgfd