ఈ డెకరేషన్ పువ్వులు చూస్తే చాలు.. కొనాల్సిందేనట..

హైదరాబాదులో కృత్రిమ పువ్వులు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. హైదరాబాదీలు ఈ కృత్రిమ పువ్వులను ఇంట్లో డెకరేషన్ వస్తువుల లాగా వాడుకుంటున్నారు. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంటికి కొత్త లుక్ వస్తుంది.
అయితే ప్రతి ఒక్కరూ ఈ కృత్రిమ పువ్వులను కొనాలనుకుంటున్నారు. ఈ ఆకర్షింపజేసే కృత్రిమ పువ్వులు హైదరాబాదులోని బంజారాహిల్స్ తాజ్ డెక్కన్ హోటల్లో ఇటీవల జరిగిన అప్ స్టేజ్ ఈవెంట్ లో అందర్నీ ఆకర్షింప చేసిన ఫ్లవర్ కంపెనీ అనే స్టాల్‌లో ఉన్నాయి.
ఈ స్టాల్ లో వివిధ దేశాల నుంచి దిగుమతి చేసిన కృత్రిమ పుష్పాలు ఉన్నాయి. వీటిని హాంగ్ కాంగ్, చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటామని ఫ్లవర్ కంపెనీ యజమాని అదితి తెలిపారు.
అయితే వీరి స్టాల్ లో డెకరేషన్‌కి కావాల్సిన కృత్రిమ పుష్పాలు ఉన్నాయి. ఈ పుష్పాలకు వివిధ ధర ఉంటుంది. పుష్పాలకు వేరే ధర అలాగే కర్రలకు వేరే ధర ఉంటుంది.
కర్రలు కేవలం 70 రూపాయలతో మొదలవుతున్నాయి. గరిష్టంగా 600 రూపాయల వరకు ఉంటాయని తెలిపారు.
ఈ ఫ్లవర్ కంపెనీ స్టాల్ లో వివిధ రకాల గిఫ్టింగ్ పువ్వులు లభిస్తున్నాయి. ఈ పువ్వులను గిఫ్ట్ హంపర్లో పెట్టి ఇస్తున్నారు. ఈ గిఫ్ట్ హంపార్ల ధర దాదాపుగా 9000 రూపాయల వరకు ఉంటుందని అతిధి తెలిపారు.
అలాగే ఈ స్టాల్‌లో కృత్రిమ పువ్వుల బొకేలు కూడా ఉంటున్నాయి. వీటి ధర వాటి సైజును బట్టి ఉంటుంది. వీరి స్టాల్ లో భారతదేశంలో దొరకని బొకేలు ఉన్నాయి. ఈ స్టాల్ లో వివిధ రకాల ఫియోనీస్, సిమోడియన్స్, డెల్ఫీనియన్స్ అనే కృత్రిమ పువ్వులు లభిస్తున్నాయి.
ఈ కృత్రిమ పూలల్లో బాగా ఫేమస్ అయిన కింగ్ కో లీవ్స్ బంగారం, వెండి రంగుల్లో లభిస్తున్నాయి. వీటిని ఒక కర్రకి 150 రూపాయలతో అమ్ముతున్నారు.
అలాగే వీరి దగ్గర పొద్దుతిరుగు పువ్వులు, తులిప్స్ ఇంకా ఎన్నో రకరకాల కృత్రిమ పుష్పాలు లభిస్తున్నాయి. వీరి దగ్గర క్యాండిల్ స్టాండ్, కేక్ స్టాండ్స్ చాలా తక్కువ ధరల్లో ఉన్నాయి.
ఈ వస్తువులను క్యాండిల్ లైట్ డిన్నర్‌లో ఉపయోగిస్తే చాలా బాగుంటుందని ఫ్లవర్ కంపెనీ యజమాని అతిథి తెలిపారు. వీరి దగ్గర చాలా ఖరీదైన బొకే ఉంది. ఈ బొకేని మదర్ ఆఫ్ పల్స్ అని అంటున్నారు. ఈ బొకే కేవలం 7000 రూపాయలకే లభిస్తుంది. అలాగే వీరి దగ్గర పూల తొట్టీలు, మాగ్నెటిక్ క్యాండిల్ స్టాండ్స్ లభిస్తున్నాయని లోకల్ 18 ప్రతినిధితో తెలిపారు.

2024-03-27T10:42:09Z dg43tfdfdgfd