ఈ వర్షాకాలం ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే ఎందుకంటే..!

ఈ వర్షాకాలం కొన్ని రాశులపై చాలా గట్టి ప్రభావమే చూపించనుందట.  ఈ ప్రభావాన్ని నివారించలేము కానీ కొన్ని నివారణలను తెలుసుకోవడం ద్వారా దీనిని తగ్గించవచ్చు. మరి, ఏ రాశివారిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం..

 

జోతిష్యశాస్త్రానికి మన శాస్త్రాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ జోతిష్యం ఆధారంగా.. ఒక మనిషి కి సంబంధించిన శుభ, అశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు. ఇలా ముందుగానే తెలుసుకోవడం వల్ల.. ఎక్కువ నష్టం జరగకుండా నివారించే అవకాశం ఉంటుంది. కాగా... ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది. ఈ వర్షాకాలం కొన్ని రాశులపై చాలా గట్టి ప్రభావమే చూపించనుందట.  ఈ ప్రభావాన్ని నివారించలేము కానీ కొన్ని నివారణలను తెలుసుకోవడం ద్వారా దీనిని తగ్గించవచ్చు. మరి, ఏ రాశివారిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం..

 

ఈ వర్షాకాలంలో  వృషభ రాశి వారు  మానసికంగా ప్రభావితమవుతారు. నిరాశకు గురవుతారు. 

కర్కాటక రాశివారు కాలు, వెన్నునొప్పి పట్ల అప్రమత్తంగా ఉండాలి.

ధనుస్సు రాశివారు ఆలోచనాత్మకమైన మానసిక స్థితిని కలిగి ఉంటారు. ఆకలి లేకపోవడం, శారీరక బలహీనత వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

మీనం, మకర రాశులు వేడి స్వభావాన్ని కలిగి ఉంటారు. మానసిక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆకలి ఉండదు., శారీరక నొప్పి పెరుగుతుంది.

మేష రాశివారు ఆకస్మిక ధనము, చేసిన పనుల వలన మంచి ఫలితాలు పొందుతారు. 

మిధున రాశి వారికి గృహ యోగం, ఆకస్మిక సంపద , శారీరక నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి వారు వస్త్రదానం, అన్నదానం, ధనం దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

 

ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ మాసాలను చాతుర్మాసం అంటారు. ఈ నాలుగు నెలలను దాన కాలం అంటారు. వర్షాకాలంలో పక్షులు , జంతువులకు ఆహారం ఇవ్వాలి. ఆహారాన్ని పక్షి గూళ్లలో ఉంచాలి. దీనివల్ల వర్షంలో కూడా బతకగలుగుతాయి. అంతేకాదు జంతువులలో ఆవులు, కుక్కలు, ఇతర జంతువులకు కూడా ఆహారం లేదా మేత అందించాలి, తద్వారా పుణ్యం లభిస్తుంది.

2024-07-26T11:22:42Z dg43tfdfdgfd