ఎక్కువ సేపు ఇయర్ బడ్స్ పెట్టుకున్నందుకు ..18ఏళ్ల యువకుడికి చెవుడు వచ్చింది..ఎక్కడంటే

స్మార్ట్ ఫోన్‌ (Smart phone)ఉన్న ప్రతి ఒక్కరూ చెవిలో ఇయర్ బడ్స్(Ear buds)పెట్టుకోవడం ప్రస్తుతం అలవాటైపోయింది. అయితే ఇందులో కొందరికి అది అవసరమే అయినప్పటికి చాలా మంది మాత్రం అనవసరంగా వాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని గోరఖ్‌పూర్‌(Gorakhpur)లో 18ఏళ్ల యువకుడు ఎక్కువ సమయం చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకోవడం కారణంగా ఏకంగా వినికిడి శక్తి(Deaf)ని కోల్పోయాడు. ఓ ఇంగ్లీష్ వార్త పత్రిక ప్రచూరించిన కథనం ప్రకారం సదరు యువకుడు చెవిలో ఇన్‌ఫెక్షన్ (Infection)చేరి పూర్తిగా వినికిడి శక్తిని కోల్పోయినట్లుగా డాక్టర్లు చెప్పారు.

ఇయర్ బడ్స్‌ వల్ల డేంజర్ ..

ట్రెండ్‌ అని కొందరు, ఫ్యాషన్ పేరుతో మరికొందరు, కొందరు వారి వారి వృత్తి, వ్యాపార రిత్య ఫోన్‌లు డైరెక్ట్‌గా మాట్లాడకుండా వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడుతున్నారు. ఈసంఖ్య ప్రస్తుతం సమాజంలో బాగా పెరిగిపోయింది. ఇయర్ బడ్స్ వాడటం వల్ల అనేక దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో 18ఏళ్ల యువకుడు ఎక్కువ సమయం ఇయర్ బడ్స్ పెట్టుకొని పాటలు వినడం, ఫోన్‌లు మాట్లాడటం వల్లే వినికిడి శక్తి కోల్పోయాడు. చెవులు సరిగా వినిపించకపోవడంతో డాక్టర్‌ని సంప్రదించాడు. వైద్యులు యువకుడికి చెవి ఇన్ఫెక్షన్ సోకిందని తేల్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

చెవుడు వచ్చింది..

యువకుడి క్షుణ్ణంగా పరిశీలించిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేసారు. అతని చెవి తిరిగి వినిపించేలా సర్జరీ చేసారు.అయితే ఈ18ఏళ్ల యువకుడి కండీషన్ చూసిన డాక్టర్లు ఎక్కువ సమయం ఇయర్ బడ్స్ పెట్టుకునే వారికి చెవిలో కెనాల్‌లో ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుందని ఫలితంగా బ్యాక్టిరియా, వైరస్‌లు పెరిగేందుకు అనుమైన వాతావరణం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

చెవులకు సర్జరీ ..

ఎక్కువ సేపు ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వల్ల చెవి కెనాల్ లో ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుందని, బ్యాక్టీరియా, వైరస్ లు పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు.ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణోపాయాల గురించి వివరించారు డాక్టర్లు.

Odisha Train Accident: ఒడిశా విపత్తు ప్రదేశాన్ని సందర్శించి మోదీ..క్షతగాత్రులను స్వయంగా పరామర్శించారు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

1.ఇయర్‌బడ్‌లు లేదా హెడ్‌ఫోన్‌లను తక్కువ సమయం ఉపయోగించాలి

2.సౌండ్ తక్కువ పెట్టుకుంటే మంచిది

3. గరిష్ట స్థాయిలో 60 శాతం కంటే ఎక్కువ వాల్యూమ్‌ను సెట్ చేసుకోవాలి

4. ధూళి, మైనపు లేదా చెమట పేరుకుపోకుండా ఉండటానికి చెవులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి

5. ఇయర్‌బడ్‌లకు బదులుగా ఓవర్ ఇయర్ హెడ్‌ఫోన్‌లను యూజ్ చేయడం మంచిది.

వినికిడి శక్తి కోల్పోకుండా చూసుకోవాలి..

జననేంద్రియాల్లో చెవులు కీలక పాత్ర పోషిస్తాయి. అవే దెబ్బతింటే ఎదుటి వాళ్లు చెప్పేది వినలేని పరిస్థితి కలుగుతుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.

2023-06-03T16:15:18Z dg43tfdfdgfd