కొబ్బరినూనెలో ఈ పొడి కలిపి రాస్తే పేల సమస్య దూరం

తలలో పేలు ఉంటే ఎక్కువగా దురదగా ఉంటుంది. దీంతో ఏ పని మీద కాన్సంట్రేట్ చేయలేం. ఈ సమస్యకి ఎలా చెక్ పెట్టొచ్చో తెలుసుకోండి.

పేల సమస్య ఎక్కువగా ఉంటే ఏ పనిని సక్రమంగా చేయలేం. దీంతో దురద ఎక్కువగా ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. సమస్య ఎక్కువగా ఉంటే తలంతా ఎర్రగా మారి వాపు, చిన్న చిన్న గడ్డలు ఏర్పడతాయి. దీంతో తలంతా చికాగ్గా ఉంటుంది. ఈ సమస్యని దూరం చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు. అవేంటో తెలుసుకోండి. సీతాఫలాల గింజల పొడి..

ఈ పొడి కూడా పేల సమస్యని దూరం చేస్తుంది. సీతాఫలాల గింజల్ని పొడిలా చేయండి. ఇందులో కొద్దిగా శనగపిండి కలపండి. దీనిని పేస్టులా చేయండి. దీనిని స్కాల్ప్‌కి అప్లై చేయండి. ఓ అరగంటపాటు అలానే ఉంచండి. తర్వాత ఆయుర్వేద షాంపూతో జుట్టుని క్లీన్ చేయండి. తర్వాత జుట్టుని దువ్వండి. దీంతో చనిపోయిన పేలు నేల రాలుతాయి. సీతాఫలాల గింజల్లోని గుణాలు పేలని చంపుతాయి. అయితే, ఒక్కసారికే సమస్య దూరమవ్వదు. రెండు మూడుసార్లు చేస్తే సమస్య తగ్గుతుంది. అయితే, వీటిని వాడే ముందుగా ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.

నిమ్మ, వెల్లుల్లి..

ఓ రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి. వాటిని క్రష్ చేయండి. అందులో కొద్దిగా నిమ్మరసం కలపి పేస్టులా చేయండి. దీనిని స్కాల్ప్ మొత్తం అప్లై చేయండి. ఓ అరగంటపాటు టవల్‌తో జుట్టుని కవర్ చేయండి. తర్వాత షాంపూతో క్లీన్ చేయండి. దీని వల్ల పేల సమస్య తగ్గుతుంది.

మెంతులు..

గుప్పెడు మెంతుల్లో కొద్దిగా నీరు పోసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే దానిని మిక్సీ పట్టి పేస్టులా చేయండి. దీనిని తలకి ప్యాక్‌లా వేయండి. ఇది అరగంట నుంచి గంట వరకూ అలానే ఉంచి తర్వాత షాంపూతో క్లీన్ చేయండి. మెంతుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ పేల సమస్యని దూరం చేస్తాయి. దీంతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గించి పొడుగ్గా పెరిగేలా చేస్తాయి.

కర్పూరం..

కర్పూరాన్ని మెత్తగా పొడిలా చేయాలి. ఈ పొడిని కొబ్బరినూనెలో కలపండి. ఇది ఓ కెమికల్స్ ఉన్న ట్రీట్‌మెంట్స్ కంటే చాలా బాగా పనిచేస్తుంది. దీనిని రాయడం వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి. ఈ నూనెని స్కాల్ప్, కుదుళ్ళకి రాయాలి. రాత్రంతా జుట్టుని షవర్ క్యాప్‌తో కవర్ చేయండి. ఉదయాన్నే లేవగానే తలస్నానం చేయండి. దీని వల్ల చాలావరకూ సమస్య తగ్గుతుంది.

​​Read More : Home remedies News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-16T09:56:40Z dg43tfdfdgfd