చవితి రోజు పొరపాటున చంద్రుడిని చూస్తే.. చేయాల్సిన పరిహారం ఇదే..!

వినాయక చవితి.. భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి. మాత పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన గణేశుని పుట్టినరోజునే వినాయక చవితిగా ఏటా మనం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున వినాయక చవితి నిర్వహిస్తుంటా. అన్ని పండగలు ఇంటి వరకే పరిమితం కాగా.. ఒక్క వినాయక చవితి మాత్రమే అందరితో కలిసి జరుపుకునే వెసులు బాటు ఉంటుంది. అందుకే చవితి ఉత్సవాలను పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు.

పురాణాల ప్రకారం వినాయక చవితి నాడు.. పూజ చేసుకొని అక్షితలు వేసుకోకుండా చంద్రుడిని చూస్తే నీలాపనిందలు కలుగుతాయని పండితులు చెపుతుంటారు. అయితే వరంగల్ కు చెందిన అర్చక స్వాములు సాయికృష్ణ ఈ దోషానికి పరిష్కారం ఉందని అంటున్నారు. అదేంటో తెలుసుకునే ముందు వినాయక చవితి నాడు చంద్రుడిని ఎందుకు చూడకూడదో స్థూలంగా ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతీ దేవి పిండితో చేసిన బాలుడికి పోసి.. అతడిని వాకిట్లో కాపలాకి ఉంచి స్నానానికి వెళ్తారంట.

ఇదీ చదవండి : తీవ్ర అనారోగ్యంతో తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూత

అదే సమయంలో అక్కడికి వచ్చిన పరమశివుడిని.. ఆ బాలుడు అడ్డుకోవడంతో. ఆగ్రహానికి గురైన పరమశివుడు బాలుడి శిరస్సు ఖండిస్తారు. ఈ ఘోరాన్ని చూసిన పార్వతీ దేవి కన్నీళ్లు పెట్టుకోగా.. పరమ శివుడు ఆ బాలుడికి ఏనుగు శిరస్సు అతికించి ప్రాణం పోస్తాడని.. ఆ బాలుడికి గజాననుడు అని నామకరణం చేస్తాడని పురాణం చెపుతోంది. ఆ బాలుడు శక్తి సామర్ధ్యాలను పరిశీలించి గణాధిపతిని చేస్తారు.

అయితే ఒకనాడు ఆ గణపతి నడవడానికి పడుతున్న అవస్థను చూసి చంద్రుడు నవ్వగా.. అతడిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరు చూస్తారో వారికి నీలాపనిందలు కలుగుతాయని తల్లి పార్వతి శపిస్తుంది. ఈ శాపం నుంచి సాక్షాత్తు శ్రీకృష్ణుడే తప్పించుకో లేకపోయాడని.. అతడికి కూడా నీలాప నిందలు కలిగాయని కథ చెపుతోంది.

ఈ కథ మనం చిన్నప్పటి నుంచి వింటున్నదే. అయితే నీలాప నిందలు కలగకుండా ఉండాలంటే వినాయకుని కథ విని అక్షితలు వేసుకోవాలని పండితులు చెపుతుంటారు. అయితే పూజ చేసుకోక ముందే పొరపాటున చంద్రుడిని చూస్తే ఏం చేయాలో సాయికృష్ణ తెలిపారు. చంద్రుడి చూసిన దోషం పోవాలంటే.. మరో వెసులు బాటు ఉందని చెపుతున్నారు. ఇలా చంద్రుడిని చూసిన వారు తల్లిదండ్రుల పాదాలకు అభివాదనం చేయడం ద్వారా నీలాపనిందల దోషం తొలగిపోతుందని తెలిపారు. దీనితో పాటు స్వామివారికి ప్రీతికరమైనటువంటి కుడుములు,ఉండ్రాళ్ళు, లడ్డులు ఇవి దగ్గరలో ఉన్నటువంటి వినాయక మండపంలో స్వామి వారికి సమర్పించడం ద్వారా కూడా ఈ దోషాన్ని తొలగించుకోవచ్చని అర్చకులు చెప్పారు.

2024-09-06T07:17:38Z dg43tfdfdgfd