చీర కట్టుకున్నప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

ఆడవారి అందాన్ని పెంచడంలో చీరలు ముందుంటాయి. చీరల్లో అందంగా కనిపించేందుకు ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలో తెలుసుకోండి.

ప్రతిసారి చీర కట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్ లుక్‌లో కనిపించాలంటే కొన్ని మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలి. మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల చీర లుక్ మొత్తం పాడైపోతుంది. ఆ తప్పులు ఏంటో తెలుసుకోండి. జ్యువెలరీ..

చీరలకి మ్యాచింగ్ బట్టలు మాత్రమే కాదు.. మ్యాచింగ్ జ్యువెలరీ కూడా ముఖ్యమే. ఏయే చీరలకి ఏయ జ్యువెలరీ సెట్ అవుతాయో అవే వాడడం మంచిది. వీటితో పాటు.. చీరలకి సరైన మ్యాచింగ్ ఫుట్ వేర్ వేయడం మంచిది. మనం వేసుకునే బట్టల రంగుకి మ్యాచ్ అయ్యే ఫుట్‌వేర్ వేసుకోవడం మంచిది. దీని వల్ల లుక్ ఎలివేట్ అవుతుంది.

సేఫ్టీ పిన్స్..

చాలా మంది ఆడవారు చీరలు కట్టుకున్నప్పుడు సేఫ్టీగా ఎక్కువగా పిన్స్ పెట్టుకుంటారు. అయితే, అవి అవసరం ఉన్నవి మాత్రమే అవసరమైన సైజ్‌లో మాత్రమే పెట్టండి. వీటిని ఎక్కువగా వాడితే చీరల క్వాలిటీ, అందం పాడవుతుంది.

కుచ్చిళ్ళు..

చీరలు కట్టుకునేటప్పుడు కుచ్చిళ్ళు సరిగ్గా కట్టుకున్నప్పుడే చీర అందంగా కనిపిస్తుంది. వీటిని మరీ పెద్దగా కాకుండా, చిన్నగా కాకుండా ఉండేలా చూసుకోండి. వీటిని మీడియంగా సరైన విధంగా ఉండేలా చూసుకోండి. దీని వల్ల లుక్ బావుంటుంది.

నడుముపైనే..

అదే విధంగా చీరలు కట్టేటప్పుడు కొంతమంది మరీ పైకి కడితే.. మరికొంతమంది మరీ కిందకి కడతారు. దీని వల్ల చూడ్డానికి అస్సలు బాగోదు. అందుకే, అలా కాకుండా నడుముపైనే లేదంటే కాస్తా కిందకి కట్టుకోండి. దీని వల్ల చీర చూడ్డానికి బావుంటుంది.

ఫిజిక్‌ని బట్టి..

అన్నీ చీరలు అందరికీ సెట్ అవుతాయని అనుకోవద్దు. చీరల్ని మనం ఎత్తు, బరువుని బట్టి ఎంచుకోవాలి. దీని వల్ల చూడ్డానికి అందంగా కనిపిస్తారు. అదేవిధంగా, చీరలోపల వేసుకునే పెట్టీకోట్స్ అంటే ఇన్నర్ స్కర్ట్స్ కూడా చీర మ్యాచింగ్‌లోనే ఉండాలని గుర్తుపెట్టుకోండి. దీని వల్ల చీర చూడ్డానికి అందంగా కనిపిస్తాయి. అంతేకాకుండా, పూర్తిగా వేరే రంగులోనివి ఎంచుకుంటే చీరలు చూడ్డానికి అంత అందంగా కనిపించవు.

మ్యాచింగ్ లేని బ్లౌజ్..

చాలా మంది ఆడవారు చేసే మిస్టేక్స్ ఇదే. చీరలు కట్టుకున్నప్పుడు మ్యాచింగ్ లేని బ్లౌజ్ వేసుకుంటారు. దీని వల్ల చీర లుక్ మొత్తం మారిపోద్ది చూడ్డానికి అస్సలు బాగోదు. అందుకే, కచ్చితంగా మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవడం మంచిది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-27T07:08:21Z dg43tfdfdgfd