చేతి గోర్లని ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుందట..

జుట్టు పెంచుకోవాలని చాలా మందికి ఉంటుంది. అలాంటప్పుడు మనం కేవలం బయట నుంచి ప్యాక్స్ మాత్రమే కాకుండా లోపల నుంచి వాటిని బలంగా చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకోండి.

జుట్టు రాలడం ఆపి పెంచుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవి కూడా నేచురల్‌గా ఉండాలి. అలాంటి వాటిలో ఒకటి చేతి గోళ్ళని రుద్దడం. వీటి వల్ల జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుందట.గోళ్ళను రుద్దితే..

గోళ్ళని రుద్దడం వల్ల రాపిడి ఏర్పడి బ్రెయిన్‌కి సందేశం వెళ్తుంది. దీని వల్ల స్కాల్ప్ కణాలు ఉత్తేజితమవుతాయి. తలకి రక్తప్రసరణ అందుతుంది. దీని వల్ల జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుంది.

హెయిర్ ఫాల్‌కి కారణాలు​ ​

ఆయుర్వేదంలో..

గోర్ళని రుద్దడం వల్ల వెంట్రుకలు పెరుగతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల వాత, పిత్త, కఫ దోషాలు దూరమై చర్మ, జుట్టు సమస్యలు పరిష్కారమవుతాయి. చాలా సమస్యలు దూరమై అన్నీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంద.ి ​Also Read : జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇంట్లోనే తయారుచేసే ఈ ఆయిల్ రాయండి..

బాలయం..

యోగాలో దీని బాలయం అంటారు. బాల్ అంటే హిందీలో వెంట్రుకలు అని అర్థం. దీనిని చేయడం వల్ల వెంట్రుకలు బలంగా మారతాయి. ఎలా చేయాలంటే చేతులని మడిచి వేళ్ళని మీ వైపుకి పెట్టండి. ఇలా చేతివేళ్ళని రుద్దండి. ​Also Read : ఈ జెల్ రాస్తే జుట్టు మృదువుగా మారి పొడుగ్గా పెరుగుతుంది..

ఎవరు చేయొద్దు..

కొంతమంది ఈ వ్యాయామం చేయకపోవడం మంచిది. మరీ ముఖ్యంగా ప్రెగ్నెంట్స్. అలానే హైబీపి ఉన్నవారు కూడా చేయొద్దు. అయితే దీనిని చేయడం వల్ల ముఖంపై వెంట్రుకలు, గడ్డం, మీసాలు పెరుగుతాయి. కాబట్టి, మీ అవసరాలను బట్టి చేయండి. ఈ వ్యాయామం చేసే ముందు నిపుణులని సంప్రదించడం మంచిది.

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Beauty News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-29T05:33:48Z dg43tfdfdgfd