జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చేయండి..

జుట్టు రాలి, సన్నమవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో వంశపారంపర్యత అని కూడా చెప్పొచ్చు.

కొంతమందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న జుట్టు రాలుతూనే ఉంటుంది. దీని వల్ల చాలా బాధలు పడతారు. అంతేకాకుండా చూడ్డానికి జుట్టు పీలగా, సన్నగా మారిపోయి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటప్పుడు జుట్టు ఎందుకు రాలుతుంది.. రాలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై కచ్చితంగా శ్రద్ధ అవసరం. వారసత్వం..

జుట్టు పల్చగా మారడానికి చాలానే కారణాలున్నాయి. అందులో ఒకటి కుటుంబంలోని తల్లిదండ్రులు, తాతలకి ఏమైనా ఈ సమస్య ఉంటే అది తర్వాతి తరం వారికి కూడా వస్తుంది. దీంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలుతూనే ఉంటుంది.

జుట్టు రాలడానికి కారణాలు..​ ​

ఏమేం తినాలి..

విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా జుట్టు పెరగడానికి హెల్ప్ చేసే పోషకాలు. ముఖ్యంగా జుట్టు సమస్యలు దూరమవ్వాలంటే జింక్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ​Also Read : తెల్లజుట్టు నల్లగా మారాలంటే వీటిని రాయండి..

పోషకాహారం..

ఆహారం కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు. జుట్టు ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తుంది. దీంతో జుట్టు రాలే సమస్యని తగ్గించుకోవచ్చు. ఇందుకోసం పోషకాలతో నిండిన ఫుడ్‌ని తీసుకోవచ్చు.

ఇతర కారణాలు..

హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ప్రెగ్నెన్సీ టైమ్పీరియడ్స్ టైమ్PCOSఒత్తిడిపోషకాహారం తీసుకోకపోవడంసరిగ్గా మెంటెయిన్ చేయకపోవడం..​Also Read : Hair Oil : వారానికి ఎన్నిసార్లు రాస్తేజుట్టు పొడుగ్గా పెరగుతుంది

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డైట్‌లో ఆకుకూరలు, గుడ్లు, చేపలు, నట్స్, హోల్ గ్రెయిన్స్‌ని ఎక్కువగా యాడ్ చేయాలి. జుట్టుని జాగ్రత్తగా చూసుకోవాలి. దువ్వడానికి వెడల్పాటి పండ్లు ఉన్న దువ్వెన వాడాలి. హెయిర్ డ్రైయర్స్, స్ట్రెయిటనర్ వంటి హీటింగ్ పరికరాలు వాడొద్దు. జుట్టు చిట్లిపోవడం సాధారణం. కాబట్టి, ప్రతి 6 నుంచి 8 వారాలకి ఓ సారి ట్రిమ్ చేయండి. షాంపూ, కండీషనర్ రెండూ కూడా ఎక్కువ కెమికల్స్ లేనివే వాడండి. ఇన్నిచేసినా సమస్య తగ్గకపోతే డాక్టర్‌ని కలిస్తే మిమ్మల్ని పరీక్షించి లేటెస్ట్ ట్రీట్‌మెంట్ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, లోయర్ లెవల్ లేజర్ థెరపీ వంటి ట్రీట్‌మెంట్స్‌ని చేయిస్తారు.

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Beauty News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T07:20:38Z dg43tfdfdgfd