తలస్నానం ముందు ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుంది

జుట్టు పొడుగ్గా పెరగాలని చాలా మందికి ఉంటుంది. కానీ, నేటికాలంలో కొన్ని సమస్యల కారణంగా జుట్టు రాలుతుంది. వాటికి చెక్ పెట్టి జుట్టు పొడుగ్గా పెరగాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

జుట్టు రాలడం అనేది ప్రజెంట్ కామన్ ప్రాబ్లమ్ అయింది. దీనికి సరైన డైట్ ఫాలో అవ్వకపోవడం, మెంటెయిన్ చేయకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి, జన్యు కారణాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. వాటన్నింటికి చెక్ పెట్టాలంటే కొన్ని జాగ్రత్తలు ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకోండి. హెల్దీ డైట్..

డైట్ అనేది మన ఆరోగ్యానికి మాత్రమే కాదు. జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే, మనం జుట్టుని ఆరోగ్యంగా చేసుకోవాలంటే ప్రోటీన్, ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. పోషకాహారం లోపం ఉందో ఓ సారి చెక్ చేయించుకుని దానికి అనుగుణంగా మందులు వాడాలి.

హెయిర్‌ఫాల్‌కి కారణాలివే..​ ​

ప్రయోగాలు వద్దు..

అదే విధంగా కొంతమంది జుట్టుకి రకరకాల కెమికల్ ట్రీట్‌మెంట్స్ చేయిస్తారు. బ్లీచింగ్, హీటింగ్ టూల్స్ వాడడం, రకరకాల టైట్ హెయిర్ స్టైల్స్. వీటన్నింటి కారణంగా జుట్టు బలహీనమవుతుంది. రాలి పోతుంది. అలా కాకుండా జుట్టుని కాస్తా ఊపిరి పీల్చుకోనివ్వండి.

స్ట్రెస్‌ని తగ్గించుకోవడం..

నేడు ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు. ఉద్యోగ, ఇంటి బాధ్యతలు నెత్తిమీద పడేసరికి అన్నింటిని బ్యాలెన్స్ చేయలేక చాలా మంది స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నారు. దీని కారణంగా కూడా జుట్టు రాలుతుంది. అలా కాకుండా ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీనికోసం యోగా, ధ్యానం చేయాలి.

మసాజ్..

జుట్టుని కాపాడుకోవడంలో హెయిర్ మసాజ్ కీ రోల్ పోషిస్తుంది. హెయిర్ స్కాల్ప్‌పై మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల జుట్టు పెరుగుతుంది. జుట్టు సమస్యలు తగ్గుతాయి. దీనికి ఏ నూనె అయినా సరే డబుల్ బాయిల్డ్ మెథడ్‌లో కొద్దిగా గోరువెచ్చగా చేసి వాడండి.

ఏ షాంపూ కండీషనర్..

అడ్వర్టైజ్‌మెంట్స్ ప్రభావంతో చాలా మంది ఏవి పడితే అవే షాంపూ, కండీషనర్స్ వాడుతున్నారు. కానీ, అలా కాదు.. మనకి హెయిర్‌ని బట్టి ఏ షాంపూ వాడాలో డాక్టర్‌ని కలిసి ఆ తర్వాతే షాంపూ వాడడం మంచిది.

దువ్వడం..

చాలా మంది తలస్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేసి వెంటనే తలస్నానం చేస్తారు. అలా కాదు కనీసం అరగంట తర్వాతే స్నానం చేయాలి. అదే విధంగా, తలస్నానానికి ముందు జుట్టుని దువ్వి చిక్కులు తీయాలి. దీని వల్ల జుట్టుని క్లీన్ చేసుకునేటప్పుడు రాలడం తగ్గుతుంది.

తలస్నానం..

ఎప్పటికప్పుడు తలని క్లీన్ చేసుకోవడం కూడా ముఖ్యమే. అలా అని రోజు తలస్నానం అవసరం లేదు. దీని వల్ల జుట్టు బలహీనమవుతుంది. కాబట్టి, అలా కాకుండా వారానికి రెండు నుంచి మూడు సార్లు తలస్నానం చేయండి. దీని వల్ల జుట్టు, స్కాల్ప్ క్లీన్‌గా ఉంటుంది. రాలడం తగ్గుతుంది. పెరుగుతుంది. అదే విధంగా, తలస్నానానికి వాడే నీరు కూడా మరీ చల్లగా, మరీ వేడిగా ఉండకూడదు. ఎక్కువగా వేడినీటితో స్నానం చేస్తే తలలోని సహజ తేమ తగ్గుతుంది. దీంతో జుట్టు రాలుతుంది. అందుకే, గోరువెచ్చని నీటిని వాడండి.​

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Beauty News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-07T07:38:09Z dg43tfdfdgfd