నీళ్లు తాగడానికి జిరాఫీ ఎంత కష్టపడాలో తెలుసా.. ఈ వీడియో చూడండి.. అయ్యో పాపం అంటారు..!

జంతు ప్రపంచానికి సంబంధించి.. షోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తెగ ఆకట్టుకుంటుంటాయి. జంతు ప్రపంచానికి సంబంధించిన దృశ్యాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. కొన్ని ప్రత్యేకమైన జీవులు కనిపించినప్పుడు.. అవి అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అంతే కాకుండా జంతువులు ఎలా జీవనం సాగిస్తాయో తెలుసుకోవడానికి ప్రజలు బాగా ఇష్టపడతారు. ఎందుకంటే అవి అడవిలోని కష్టతరమైన జీవితాన్ని మరియు జంతువుల పోరాటాన్ని చూపుతాయి.

ఇదీ చదవండి : దాల్చిన చెక్కతో ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు.. వాడే విధానం ఇదే

అచ్చు ఇలాంటిదే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అడవిలో నివిసిస్తున్న ఓ జిరాఫీకి సంబంధించింది. వైరల్ అవుతున్న వీడియోలో జిరాఫీ నీరు త్రాగడానికి ఎంత కష్టపడుతుందో మీరు చూడవచ్చు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అయ్యో పాపం అనుకుంటున్నారు. కంటి ముందే నీరు ఉన్నా ఎక్కువ హైట్ ఉండటం కారణంగా అది నీరు తాగడానికి ఇబ్బంది పడింది.

జిరాఫీ నీళ్లు తాగడం ఇలా...

వైరల్ అవుతున్న వీడియోలో నది ఒడ్డున జిరాఫీకి ఉండటాన్ని మీరు చూడవచ్చు. జిరఫీకి నీరు ఎంత తాగాలని ఉన్నా.. దాని శరీర నిర్మాణం కారణంగా నీటిని అందుకోవడం కష్టంగా మారింది. మరోవైపు అడవి కావడంతో తాను ఎవరికీ ఎర కాగూడదని భావించిన జిరాఫీ.. ముందు ఎవరైనా వస్తున్నారా అని చెక్ చేసుకుంది. అనంతరం కాళ్లను మెడను బ్యాలెన్స్ చేస్తూ.. మొదటి సారి నీరు తాగడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.. అనంతరం మరోసారి కాళ్లను వెడల్పుగా చాపి నీరు తాగింది.

ఈ వీడియో @wonderofscience పేరుతో సోషల్ మీడియా ఖాతా Xలో ఫేర్ చేశారు. దీనిని లక్షలాది మంది వీక్షించారు. వీడియోని చూసిన నెటిజన్లు జిరాఫీపై జాలిపడుతున్నారు. ప్రతిసారీ నీళ్లు తాగడానికి జిరాఫీ ఇంత కష్టపడాలా అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

2024-03-28T15:44:18Z dg43tfdfdgfd