నేను భారతీయ పురుషులతో డేటింగ్ చేయను.. ఈ మూడే కారణాలు.. లైఫ్ కోచ్ వీడియో వైరల్..!

కాలం మారింది. కాలంతో పాటు మనం కూడా మారం. ఒకప్పుడు విదేశాల్లోనే ఉండే డేటింగ్ కల్చర్ ఇప్పుడు మనవరకు వచ్చింది. అయితే డేటింగ్ వెళ్లే విషయంలో ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్టాలు, అయిష్టాలు , ప్రాధాన్యతలు ఉంటాయి. రిలేషన్ షిప్ , లైఫ్ కోచ్ ఇటీవలే ఆమె భారతీయ పురుషులతో డేటింగ్ చేయకూడదని చెప్పింది. తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో చెప్పడానికి మూడు జస్టిఫికేషన్స్ కూడా ఇస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు రకరకాల కామెంట్స్ పోస్ట్ చేశారు. కొందరు ఆమెతో ఏకీభవించారు, మరికొందరు ఆమెను వ్యతిరేకించారు. ఇంకొందరు మీ ప్రకటనలను "హాస్యాస్పదంగా" ఉన్నాయంటూ పేర్కొన్నారు.

చేతనా చక్రవర్తి Instagramలో ఓ వీడియో పోస్టు చేశారు. అందులో మాట్లాడుతూ... ఆమె "నేను ఇకపై భారతీయ పురుషులతో డేటింగ్ చేయను, దీనికి ప్రధాన కారణాలు ఇక్కడ ఉన్నాయి. భారతీయ పురుషులకు "కఠినమైన సంభాషణలు ఎలా ఉండాలో" బోధించలేదని అన్నారు. "వారు ఒక అంశాన్ని వాదించలేనప్పుడు, వారు నిశ్శబ్దంగా ఉంటారు . స్త్రీని బలమైన వాదించే వ్యక్తిగా , దూకుడు ఉన్న మహిళగా లేబుల్ చేస్తారు. రెండవ కారణాన్ని వివరిస్తూ, "వారికి రొమాన్స్ అంటే ఏంటో అర్థం కాదు," శృంగారం అంటే "ప్రతి ఒక్క చిన్న సంజ్ఞ కూడా " అని చెప్పింది. రొమాన్స్ అంటే కేవలం పెద్ద బహుమతులు లేదా గొప్ప హావభావాల గురించి మాత్రమే కాదు. చివరగా, ఆమె మాట్లాడుతూ.. మూడు కారణం కూడా చెప్పింది. ఒక ఇంటిని ఎలా చూసుకోవాలో భారతీయ పురుషులకు తెలియదని పేర్కొన్నారు. "ఇది మీరు కూడా ఆ ఇంటిలో నివసిస్తున్నారు ఆ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వారికి కూడా ఉంటుంది. అంతేతప్పా ఏదో మీ భాగస్వామికి మేలు చేస్తున్నానని ఫీల్ అవ్వకూడదు" అని ఆమె క్లిప్‌లో వ్యాఖ్యానించింది.

రిలేషన్ షిప్ కోచ్ మాట్లాడుతూ, తన ఖాతాలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు పూర్తిగా తన వ్యక్తిగతమన్నాు. మరెవరి అభిప్రాయాలు కావన్నారు.

షేర్ చేసినప్పటి నుండి, ఆమె వీడియోకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 12,000 లైక్‌లను , 79,000 వ్యూస్ వచ్చాయి. ఓ నెటిజన్ దీనికి "అసమ్మతి తెలుపుతూ.. నేను ఒక అద్భుతమైన భారతీయుడిని వివాహం చేసుకున్నానని పేర్కొన్నారు. వీటికి లింగ భేదం కారణం కావచ్చు .. మీరు మీ చెడు అనుభవాల గురించి మాట్లాడుతున్నారు కానీ మీరు దానిని భారతదేశానికి అలా పరిమితం చేయకూడదు రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరొకరు, "ఇది భారతీయ పురుషుల సమస్య కాదు. ఇది లింగ సమస్య." అని పేర్కొన్నారు. మరికొందరు నెటిజన్లు ఇక్కడ భారతదేశంలో, తల్లిదండ్రులు లేదా పాఠశాలలు మీరు వీడియోలో పేర్కొన్న అన్ని విషయాలను చిన్నపిల్లలకు నేర్పించరన్నారు. చాలా ప్రవర్తనా అంశాలు వారు నేర్చుకునే లక్షణాలు అపరిపక్వమైన స్నేహితులతో గడపడం , బాలీవుడ్ చిత్రాలను తీసుకోవడం వల్ల నాకు ఈ విషయాల యొక్క ప్రాముఖ్యత గురించి బాగా తెలుసన్నారు. ఎందుకంటే మా అమ్మ నాకు సరైన వయస్సులో నేర్పిందని ఓ నెటిజన్ కామెంట్లు చేశారు. తన భావోద్వేగ మేధస్సు, సంబంధాలు, మనస్తత్వం గురించి పుస్తకాలు చదివానన్నారు. నాయకత్వం, మర్యాదలు , సంతోషకరమైన దీర్ఘకాలిక సంబంధంలో భారీ పాత్ర పోషిస్తాయన్నారు. మరో నెటిజన్... ఇలా వ్రాశారు, "కాలం మారిందని , కాలంతో పాటు స్త్రీలు కూడా మారారని వారు గ్రహించలేదు’ అని పేర్కొన్నారు. మొత్తం మీద లైఫ్ కోచ్ చేతన చక్రవర్తి పెట్టిన వీడియో నెట్టింట ఆసక్తికర చర్చకు తెరదీసింది.

2024-07-25T05:40:26Z dg43tfdfdgfd