పంచదారలో ఈ పొడి కలిపి చల్లితే బొద్దింకలు రావు

బొద్దింకలని చూడగానే కాస్తా చిరాగ్గా అనిపిస్తుంది. వాటిని ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. బొద్దింకలని చూడగానే కాస్తా చిరాగ్గా అనిపిస్తుంది. వాటిని ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటే అవి చూడ్డానికే కాదు.. ఆరోగ్యానికి కూడా అంత మంచివి కాదు. వీటిని మనం ఇంట్లో నుంచి పారిపోయేలా చేయాలంటే కొన్ని ఇంటి చిట్కాలు కూడా హెల్ప్ చేస్తాయి. వీటి కారణంగా ఇల్లు నీట్‌గా ఉంటుంది. బొద్దింకలు కూడా ఎక్కువగా రావు. అవేంటో తెలుసుకోండి. డీ క్లటర్..

ఇంట్లో అనవసరమైన వస్తువులని, న్యూస్‌పేపర్స్, కార్డ్‌బోర్డ్స్, మ్యాగజైన్స్ లేకుండా చూసుకోండి. వీటన్నింటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి. దీని వల్ల చెత్త పేరుకుపోదు. బొద్దింకలు కూడా దూరమవుతాయి.

క్లీన్ చేయడం..

డర్టీగా ఉంటే త్వరగా బొద్దింకలు వస్తాయి. అందుకే అలా ఉండకుండా చూసుకోండి. కిచెన్, ప్యాంట్రీ అన్నింటిని కూడా క్లీన్ చేయండి. దీంతో పాటు ఇంట్లో ఎక్కడైనా హోల్స్, క్రాక్స్, పగిలిన పైప్స్, సింక్స్ ఉంటే వాటిని ముందుగా క్లోజ్ చేయండి. దీని వల్ల బొద్దింకలు నివాసాలు ఉండవు.

బోరిక్ యాసిడ్..

బొద్దింకల్ని దూరం చేయడంలో బోరిక్ యాసిడ్ హెల్ప్ చేస్తుంది. అందుకే, బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట బోరిక్ యాసిడ్‌ని చల్లండి. దీని వల్ల బొద్దింకలు రావు.

బేకింగ్ సోడా..

బేకింగ్‌ సోడా, పంచదారని సమాన పరిమాణంలో తీసుకుని కలపండి. ఈ పొడిని అక్కడక్కడ చల్లండి. దీని వల్ల బొద్దింకలు కనిపించవు. పంచదార బొద్దింకల్ని అట్రాక్ట్ చేస్తాయి. బేకింగ్ సోడా బొద్దింకలని దూరం చేస్తుంది. కాబట్టి, ఈ రెండింటిని కలిపి వాడడం వల్ల బొద్దింకలు దూరమవుతాయి.

వైట్ వెనిగర్..

వైట్ వెనిగర్ కూడా బొద్దింకల్ని దూరం చేస్తుంది. అంతేకాకుండా అవి వ్యాపింపజేసే బ్యాక్టీరియాని కూడా దూరం చేస్తుంది. ఈ వైట్ వెనిగర్‌ని అక్కడక్కడ స్ప్రే చేయండి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-14T05:40:46Z dg43tfdfdgfd