పచ్చళ్లు కావాలా.. కరీంనగర్ పద అంటున్నారట .. ఎందుకంటే!

వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే క్రేజే వేరే ఉంటది. రుచికరమైన పచ్చళ్లకు మరింత డిమాండ్ ఉంటుంది. బీమవరం వెజ్..నాన్ వెజ్ పచ్చళ్ళు ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇళ్లలో తయారు చేసి వివిధ రాష్టాలకు ఎగుమతి చేస్తారు.
అలాంటి భీమవరం పచ్చళ్ళు ఇప్పుడు మన కరీంనగర్ ప్రజ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు 100 రకాల వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు దొరుకుతున్నాయి. కరీంనగర్ చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి టవర్ సర్కిల్ ప్రాంతంలో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా భీమవరం పచ్చళ్ల మార్ట్ పేరు తో వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు అమ్ముతున్నాడు..ఈ పికిల్ మార్ట్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి మంచి ఆదరణ పెరిగిందని శ్రీనివాస్ లోకల్ 18కి వివరించారు.
ఈ పిక్లీ మార్ట్ లో100 రకాల వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లతో పాటు వివిధ రకాల కరివేపాకు పొడి, మిర్చి పొడి, అల్లం పొడి లు అందుబాటులో ఉన్నాయి.ఈ పచ్చళ్లను ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సహజ సిద్ధంగా తయారుచేసి పాతకాలం నాటి జార్లలో నిల్వచేసి విక్రయానికి సిద్ధంగా ఉంచుతారు. ఈ పచ్చళ్లలో ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇండ్లల్లో తయారు చేసుకున్నట్టు చేస్తారు. మటన్, చికెన్, చేపలు, పీతలు, రొయ్యలతో పాటు వెజ్ లో గోంగూర, మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ తదితర పచ్చళ్ళును పిల్లలు, పెద్దల రుచికి అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి
ఇక పచ్చళ్ల ధరల విషయానికి వస్తే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయట. ప్రజల రుచికి అనుగుణంగా ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజసిద్ధంగా వాడే కారం, పల్లినూనె, సుగంధ ద్రవ్యాలను వాడి పచ్చళ్లు తయారుచేసి భద్రపరుస్తున్నారు.
కరీంనగర్ నగరంలో మొదటిసారి.. 100 రకాల పచ్చళ్ళు ఒకే దగ్గర లభించడం తో పచ్చల ప్రియులు వారికి నచ్చిన పచ్చలను తీసుకువెళ్తున్నారని శ్రీనివాస్ అంటున్నా..ఒక్కసారి వచ్చిన ప్రజలు పచ్చళ్ళ రుచి నచ్చడంతో మళ్లీ మళ్లీ వచ్చి తీసుకెళ్తున్నారు. అయితే కరీంనగర్ ప్రజలే కాకుండా వివిధ దేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఆర్డర్ పై పచ్చళ్ళను కొనుగోలు చేసి విదేశాలకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
వీరి దగ్గర నాన్ వెజ్ పచ్చళ్లలో అపోలో ఫిష్ దొరకడం విశేషం.. ఇక్కడ పావు కేజీ, అరకేజీ, కేజీల, చొప్పున ఈ పచ్చ లను విక్రయిస్తున్నామని నిర్వాహకుడు తెలిపారు.

2024-03-29T12:31:43Z dg43tfdfdgfd