పర్యావరణ గణనాథుడు.. మీరు చూస్తే చాలు దండం పెట్టేస్తారు!

గణేష్ ఉత్సవాలను రొటీన్ కు భిన్నంగా ప్రతి ఏటా ఒక్కో రకమైన గణేష్ లను ప్రతిష్టించడం వీరి ప్రత్యేకత. ఈ ఏడాది ప్రత్యేకంగా పూణేలో మట్టి, కర్రలతో ప్రకృతి ఒడిలో చెట్లపై ఉన్న వినాయకున్ని తయారు చేయించారు. ప్రస్తుతం చెట్లు లేక ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. వాటిని అరికట్టాలంటే చెట్లను నరకవద్దని మెసేజ్ ఇస్తున్నారు బజరంగ్ గణేష్ మండలి సభ్యులు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మమ్మదేవి నగర్ కాలనీకి చెందిన బజరంగ్ గణేష్ మండలి, 1993 నుంచి గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా వివిధ రూపాల్లో గణపయ్యను కొలుస్తున్నారు. గత ఏడాది వెండి గణేష్ ను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ప్రత్యేకంగా పూణేలో గణేష్ ను తయారు చేయించారు. మట్టి, కర్రల సహాయంతో అడవిలో ఉన్న వానర అవతారంలో గణేష్ ను సిద్ధం చేశారు. చూసేందుకు సహజ సిద్ధంగా ఉండటంతో పాటు గణపయ్య కనురెప్పలు ఆడిస్తున్నారు. ఈ వినాయకున్ని చూసేందుకు చుట్టుపక్కల వారు, జిల్లా వాసులు క్యూ కడుతున్నారు. గత 31 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని బజరంగ్ గణేష్ మండలి సభ్యుడు ప్రవీణ్ చెబుతున్నారు.

రేషన్ కార్డు కలిగిన వారికి భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే గుడ్ న్యూస్!

---- Polls module would be displayed here ----

గత ఐదు సంవత్సరాలుగా వినూత్న రీతిలో గణేష్ లను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నామన్నారు. అయితే ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రకృతి ఒడిలో వానర అవతారంలో ఉన్న గణేష్ ను తయారు చేయించాం. పూణేలో ప్రత్యేకంగా మట్టి, కట్టెలతో తయారు చేయించి తీసుకురావడం జరిగింది. ఇందుకోసం 1,50,000 ఖర్చయింది. అయితే ప్రస్తుతం ఆక్సిజన్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగాలంటే చెట్లను నరకవద్దు, ప్రకృతిని పెంపొందించాలి. అడవిలో ఉన్న ఈ గణేశుని చూస్తుంటే కొత్త ప్రపంచాన్ని చూసినట్టుగా ఉంటుందని భక్తులు కూడా చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా సహజసిద్ధమైన కలర్లతో, మట్టితో తయారు చేసిన గణేష్ ని వాడాలని యూత్ సభ్యులు పిలుపునిచ్చారు.

2024-09-16T04:21:31Z dg43tfdfdgfd