పితృ పక్షం ముందు ఈ సంకేతాలు కనిపిస్తే.. మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థం..!

సనాతన ధర్మంలో పితృపక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబర్ 17.. మంగళవారం ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. పూర్ణిమ తిథి పితృపక్షం ప్రారంభాన్ని సూచిస్తుంది.. అమావాస్య తిథి ముగింపును సూచిస్తుంది. పితృపక్షంలో ప్రజలు తమ పూర్వీకుల కోసం శ్రాద్ధం, తర్పణాలు చేస్తారు, అయితే మీ ఇంట్లో పూర్వీకులు మీ పై కోపంగా ఉన్నారో లేదో తెలుసుకోడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి ఈరోజు మనం అవేంటో తెలుసుకుందాం.

అయోధ్య జ్యోతిష్కుడు పండిట్ హల్కీ రామ్ తెలిపిన వివరాల ప్రకారం. పితృ పక్షం సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమవుతుందని.. పితృ పక్షం అక్టోబర్ 2 న ముగుస్తుందని చెప్పారు. పితృపక్షంలో ప్రజలు తమ పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం పెడుతుంటారు. అయితే పితృపక్షానికి ముందు.. కొన్ని సంకేతాలు కనిపిస్తే మీ ఇంట్లో పితృదోషం ఉందని చెపుతున్నాయి.

ఇదీ చదవండి : అక్కడ గంజాయి సాగుకు ప్రభుత్వం అనుమతి.. ఇక ఎలాంటి అడ్డంకులు లేవు..!

పితృ దోషానికి సంకేతాలు..

ఒక వేళ మీకు పితృదోషం ఉంటే ఇంట్లో అకస్మాత్తుగా రావి మొక్క పెరుగుతుంది. ఇంటి చుట్టూ కుక్క ఏడుస్తూ తిరుగుతుంది. ఇక తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోవడం, వివాహానికి ఆటంకం కలగడం.. వంటి సంకేతాలు కనిపిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. ఇలా జరిగితే జాగ్రత్తగా ఉండాలని చెపుతున్నారు. ఇది పూర్వీకుల కోపానికి కారణమని అంటున్నారు పండితులు. అటువంటి పరిస్థితిలో, పూర్వీకుల కోపాన్ని తగ్గించేందుకు.. పురోహితుల సూచనల మేరకు ఆరాధన, శ్రాద్ధ కర్మలు చేయాలని సూచిస్తున్నారు.

ఇవే కాకుండా పితృపక్షం సమయం కూడా పిండ దానం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో మీ పూర్వీకులు కోపంగా ఉంటే.. వారు తగిన నియమంతో పితృపక్షంలో శ్రాద్ధ కర్మ చేయాలి, తద్వారా వారు మోక్షాన్ని పొందుతారు.

2024-09-07T14:48:06Z dg43tfdfdgfd