పెళ్లి పెటాకులు అయినందుకు పెద్ద పార్టీ.. ఫుల్‌గా ఎంజాయ్ చేసిన యువతి

సాధారణంగా విడాకులు తీసుకోవడాన్ని ఇప్పటికీ చాలా పెద్ద విషయంగా చూస్తారు. పెళ్లి తర్వాత విడిపోయే దంపతులను సమాజం చాలా తప్పుబడుతుంది, అవమానిస్తుంది. ముఖ్యంగా ఆడవారిపై దారుణమైన విమర్శలు చేస్తారు. భర్తల హింస తట్టుకోలేక విడాకులు తీసుకున్నా, మహిళనే సమాజం నిందిస్తుంది. అయితే ఇలాంటి మనస్తత్వం ఉన్న ప్రస్తుత సొసైటీకి ఒక మహిళ పెద్ద షాక్ ఇచ్చింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్‌, ఫ్యామిలీకి గ్రాండ్‌ పార్టీ ఇచ్చింది.

అమెరికాలో ఉంటున్న పాకిస్థానీ మహిళ, విడాకులు తీసుకున్నాక పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంది. ఆమె సెలబ్రేషన్స్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, వివాహాన్ని జీవితకాల శిక్షగా, నూరేళ్ల మంటగా చెప్పే ప్రముఖ బాలీవుడ్ సాంగ్‌కు ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది.

పర్పుల్‌ లెహంగాలో అందంగా కనిపిస్తున్న ఈ యువతి, బాలీవుడ్ మూవీ "యాక్షన్ రిప్లై"లోని "జోర్ కా ఝట్కా" పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ ఒక్క పాటకే కాదు ఊపు వచ్చే "షీలా కి జవానీ" వంటి సాంగ్స్ కూడా స్టన్నింగ్‌గా స్టెప్పులు వేసింది. విడాకుల తర్వాత మూవ్ ఆన్ అయ్యేందుకు ఈ పార్టీ నిర్వహించింది.

ఆ పాటలకు తగినట్లు ఆమె చేయడం చూస్తుంటే ఫిదా అవ్వక తప్పదు. ఆమె స్నేహితులు అక్కడే ఉన్నారు. వారు వీడియో రికార్డ్ చేస్తూ ఆమెను మరింత ఎంకరేజ్ చేశారు. ఏవో కరెన్సీ నోట్లు ఆమెపై వెదజల్లుతూ పార్టీ వైబ్‌ తీసుకొచ్చారు. పెళ్లి పెటాకులైనా ఇంత సంతోషంగా ఆమె సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. పార్టీలో 'డివోర్స్ ముబారక్' అని రాసిన బెలూన్లు కూడా కనిపించాయి. అంటే 'విడాకుల శుభాకాంక్షలు' అని అర్థం. సాధారణంగా మనం షాదీ ముబారక్ అనే విషెస్ వింటాం కానీ ఈ మహిళ కొత్త విషెస్ క్రియేట్ చేసింది.

* ఒక స్టోర్ ఓనర్:

ఈ వీడియో ఎక్కడ షూట్ చేశారో స్పష్టంగా తెలియ రాలేదు. పాకిస్థాన్‌కు చెందిన మినిట్ మిర్రర్ న్యూస్ వెబ్‌సైట్ ప్రకారం, ఆమె అమెరికాలో ఒక స్టోర్ రన్ చేస్తోంది. విడాకులు తీసుకున్నాక కొత్త జీవితానికి ప్రారంభంగా ఈ పార్టీ చేసుకుంది. అయితే డివోర్స్‌కు కారణమేంటో స్పష్టంగా తెలియదు. ముందు ఫేస్‌బుక్‌లో, తర్వాత ఎక్స్‌లో ఈ వీడియో సర్క్యులేట్ అవుతోంది. ఫేస్‌బుక్ పేజీలో ఆ వీడియోను పోస్ట్ చేస్తూ, "మన దేశంలో ఇలాగే పార్టీలు కొనసాగితే ఏదో రోజు పెళ్లి అనే ఫీలింగ్ అంతరించిపోతుంది." అని ఒక క్యాప్షన్ యాడ్ చేశారు.

---- Polls module would be displayed here ----

* నెటిజన్ల రియాక్షన్:

చాలామంది నెటిజన్లు ఈమె పార్టీ వీడియో చూసి షాక్ అయ్యారు. కొందరు ఆమెతో సపోర్ట్‌గా కామెంట్లు పెట్టారు. "ఒక రిలేషన్‌షిప్ ఏర్పరచుకోవడం చాలా కష్టం. దానికి చాలా ఏళ్లు పడుతుంది. కానీ దాన్ని తెంచుకోవడానికి కొన్ని సెకన్ల టైమ్ చాలు. ఇప్పుడు విడాకులు తీసుకోవడాన్ని ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే షాకింగ్‌గా అనిపిస్తోంది." అని ఒక యూజర్ అన్నారు. "కొంతమంది భర్త కష్టపడి సంపాదించిన సొమ్ముతో డివోర్స్ పార్టీ చేసుకుంటున్నారు" అని తీవ్రంగా విమర్శలు చేశారు. "నా మాటలు ఎవరికీ నచ్చకపోయినా పర్వాలేదు కానీ, ఈ మహిళ విడాకులను ఒక పార్టీగా చేసుకోవడం బాగోలేదు. ఇస్లాం మతం ప్రకారం విడాకులు తీసుకోవడం చాలా పెద్ద పాపం." అని ఇంకొకరు అన్నారు.

ఒక వ్యక్తి, "విడాకులు జరుపుకోవడం అస్సలు మంచిది కాదు. అది ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్ నుంచి విముక్తి చేస్తుందని నేను ఒప్పుకుంటున్నా. అది మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదే. ఆ ట్రామా నుంచి కోలుకోవచ్చు. కానీ విడాకులను జరుపుకోవడం మొదలుపెడితే, ప్రజలు పెళ్లి చేసుకోవడానికి భయపడతారు" అని కామెంట్ చేశారు. అయితే, మరికొందరు ఆమెను సమర్థించి, వైవాహిక బంధం కంటే సొంత ఆనందానికే ప్రాధాన్యతనిచ్చినందుకు ఆమెను ప్రశంసించారు.

2024-07-27T09:48:57Z dg43tfdfdgfd